
FSSAI: దేశవ్యాప్తంగా ఆహార భద్రత ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడమే లక్ష్యంగా భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) కీలక ఆదేశాలు జారీ చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు ఇకపై ఆహార తయారీ, ప్రాసెసింగ్, స్లైసింగ్, ప్యాకేజింగ్ కార్యకలాపాల్లో కేవలం ఫుడ్ గ్రేడ్, తుప్పు నిరోధక కత్తులు, బ్లేడ్లు, ఇతర సేఫ్ కటింగ్ పరికరాలను మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేసింది.
కొన్ని ఆహార సంస్థలు తుప్పు పట్టిన, పగుళ్లు ఉన్న, రంగు ఊడిపోయిన లేదా పూర్తిగా దెబ్బతిన్న కత్తులు, బ్లేడ్లు ఉపయోగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి నాసిరకం పరికరాల వల్ల ఆహారంలో భౌతిక, రసాయన, సూక్ష్మజీవుల కాలుష్యం ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ఇవి మానవ ఆరోగ్యానికి ఎంతో హానికరమని పేర్కొంది. Read also: Adulterated Ghee : భారీ కల్తీ నెయ్యి దందా .. అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్ల నెయ్యి స్వాధీనం! ఆహార భద్రత నిబంధనల ప్రకారం ఫుడ్ తయారీలో వాడే పరికరాలు విషపూరితం కాని, తుప్పు పట్టని, అత్యంత నాణ్యమైన పదార్థాలతో తయారై ఉండాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది.
కత్తులు, బ్లేడ్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. వాటిపై తుప్పు, పగుళ్లు, విరిగిన భాగాలు అస్సలు ఉండకూడదు, పరికరాలను క్రమం తప్పకుండా శుభ్రపరచడం, శానిటైజేషన్ చేయాలి. అవసరమైన చోట నిరంతరం స్టెరిలైజేషన్ ప్రక్రియను చేపట్టాలని పేర్కొంది.
ఈ సరికొత్త నిబంధనలను పాటించని వ్యాపారులపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం-2006 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరించింది. జరిమానాలతో పాటు వ్యాపార లైసెన్సులను కూడా రద్దు చేసే అవకాశం ఉంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఫుడ్ సేఫ్టీ కమిషనర్లు, ప్రాంతీయ డైరెక్టర్లు క్షేత్రస్థాయి తనిఖీల సమయంలో ఈ అంశంపై
ప్రత్యేక నిఘా పెట్టాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు జారీ చేసింది.
The Shaurya Chakra : భారత నావికాదళ చరిత్రలో తొలిసారి ఇద్దరు మహిళా అధికారులకు ‘శౌర్య చక్ర’ పురస్కారం!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Land values : పెరిగిన భూముల విలువలతో ఎవరికి లాభం?
Annamalai : అన్నామలై కొత్త ఒరవడిని సృష్టించగలరా?
Adulterated Ghee : భారీ కల్తీ నెయ్యి దందా .. అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్ల నెయ్యి స్వాధీనం!
Black Magic : ఢిల్లీలో ఘోరం: “చేతబడి” అనుమానంతో పనిమనిషిని చంపిన డాక్టర్