ఇల్లు తుడిచేందుకు ఎక్కువగా కెమికల్స్ వాడటం వల్ల రసాయనాల అవశేషాలు ఉండిపోతాయి. దీంతో ఇల్లు మురికి మారుతుంది. ఇంటిని క్లీన్ చేయడానికి ప్రతి సారి ఒకే గుడ్డని ఉపయోగించడం వల్ల కూడా ఇల్లు మురికిగా మారుతుంది. ఇంటిని క్లీన్ చేసినప్పుడు సబ్బు అవశేషాలను వదిలివేయడం వల్ల కూడా ఇల్లు మురికిగా మారుతుంది.
ఇంటిని క్లీన్ చేసే సమయంలో మూలలను విస్మరించడం వల్ల కూడా ఇల్లు మురికిగా కనిపిస్తుంది. ఒక సారి మాప్ చేసిన నీటిని మరోసారి మాపింగ్ కోసం ఉపయోగించడం వల్ల కూడా ఇల్లు మురికిగా కనిపిస్తుంది. ఇంటిని క్లీన్ చేయడానికి పొడి గుడ్డలను ఉపయోగించడం వల్ల దమ్ము పూర్తిగా తొలగదు.
దుమ్ము వేరే ప్రదేశాలకు చేరుతుంది. దీంతో ఇల్లు మురికిగా కనిపిస్తుంది. వేగంగా వ్యాక్యూమ్ క్లీన్ చేయడం వల్ల చెత్త సరిగా క్లీన్ అవ్వదు. దీని వల్ల ఇల్లు మురికిగా కనిపిస్తుంది. ఇంట్లో ప్రతి చోట వెనిగర్ ఉపయోగించి క్లీన్ చేయడం కూడా మంచిది కాదు.
దీని వల్ల కొన్ని వస్తువులు పాడవుతాయి. ఇల్లు మురికిగా కనిపిస్తుంది. నిద్రలేవగానే దుప్పట్లు మడత పెట్టడం సరికాదు. దీని వల్ల దుప్పట్లపై తేమ, నూనె జిడ్డు పేరుకుపోయే అవకాశం ఉంది
.