కాకినాడ జిల్లా తుని మండలంలోని సీహెచ్ అగ్రహారంలో కనిపించకుండా పోయిన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. జ్ఞానేశ్వరి అదృశ్యమై 13 రోజులు గడుస్తున్నా జాడ తెలియకపోవడంపై ఆందోళన నెలకుంది. ఆ చిన్నారి కోసం పోలీసు బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు.
అయినాసరే పాప ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు తమ బిడ్డ ఎక్కడ ఉందో? ఏమైందోనని తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఈ తరుణంలో జ్యోతిషం పేరుతో ఓ వ్యక్తి బాధితుల ఇంటి వద్ద గందరగోళం సృష్టించడం చర్చనీయాంశంగా మారింది.తనది తెలంగాణలో గద్వాల్ అని చెప్పుకుంటోన్న ఓ అజ్ఞాత వ్యక్తి..
జ్ఞానేశ్వరి ఇంటి వద్ద హల్చల్ చేస్తున్నాడు. తాను జ్యోతిష్యుడినని పరిచయం చేసుకుని.. అనవసరపు వ్యాఖ్యలను ఆ కుటుంబాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాడు. ‘‘పాప బతికే ఉందని.. రాత్రి ఒంటి గంటలోపు తిరిగివస్తుంది.. అప్పటిలోగా రాకుంటే ఇక రాదు’’ ‘‘పాప భూదేవత ఒడిలో ఉంది..
నేను పూజలు చేస్తే త్వరలో తిరిగి వస్తుంది’’ అంటూ కుటుంబ సభ్యులను భయపెట్టేలా అతడు చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి.గత రెండు రోజులుగా జ్ఞానేశ్వరి ఇంటి వద్ద అతడు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించినట్టు స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు వారి ఇంటి పై అంతస్తులోనే నిద్రపోయిన అతడు..
మర్నాడు ఉదయం "పాప భూదేవతల్లో కలిసిపోయింది.. ఇక చనిపోయింది’ అంటూ కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేయడమే కాదు, రాత్రి పూట పూజలు, జ్ఞానం చేయాలని ఒత్తిడి తెస్తున్నాడట. కుటుంబాన్ని మరింత భావోద్వేగానికి గురిచేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో అతడిపై జ్ఞానేశ్వరి తల్లి భవాని, కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ వేదనను అర్థం చేసుకోకుండా భయపెట్టేలా ఇలాంటి మాటలు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. అతడితో వాగ్వాదం జరిగినట్లు కూడా సమాచారం. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.జ్యోతిష్యుడి తీరు, అతడి నేపథ్యంపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
జంతువులు, కొండ చిలువలు ఏమైనా ఉన్నాయా? అని తెలుసుకోడానికి మాంసాహారంతో కూడిన బొమ్మల్ని, సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి, పరిశీలించారు. ఎక్కడా అడవి జంతువుల జాడ లేదని తేలింది. దీంతో చిన్నారి ఆచూకీపై మరింత ఉత్కంఠ పెరుగుతోంది. స్థానిక చెరువులు, బావులను ఎన్డీఆర్ఎఫ్ బలగాలు జల్లెడ పట్టాయి. పెంపుడు కుక్క పోస్ట్మార్టం నివేదిక వస్తే కొంత స్పష్టత రావొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఇక, చిన్నారి అదృశ్యంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ ప్రాంతంలో అడవి