ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనం రేపిన మద్యం రవాణా కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో విచారణ చేపట్టిన ఈడీ అధికారులు.. పలువురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ మద్యం కుంభకోణం కేసులో మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడిని తాజాగా ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో కారుమూరి సునీల్‌ను అరెస్ట్ చేసిన అధికారులు..
ఈడీ ఆఫీసుకు తరలించారు. ఇటీవల హైదరాబాద్‌లోని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసంలో తనిఖీలు నిర్వహించిన ఈడీ అధికారులు.. పలు పత్రాలను పరిశీలించారు. ఇక ఇదే మద్యం కుంభకోణం కేసులో కీలక సూత్రధారిగా ఉన్న రాజ్ కెసిరెడ్డిని ఇప్పటికే ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
అతడితోపాటు.. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా కారుమూరి సునీల్‌ను కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో మద్యం రవాణా టెండర్లను దక్కించుకోవడం..
నిధుల మళ్లింపులో కారుమూరి సునీల్ కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు రావడంతో.. విచారణ చేపట్టిన ఈడీ అధికారులు ఆయనను అరెస్ట్ అయ్యారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) ద్వారా జరిగిన రూ.195 కోట్ల మద్యం రవాణా కుంభకోణంలో కారుమూరి సునీల్ మీడియేటర్‌గా వ్యవహరించినట్లు ఈడీ విచారణలో వెల్లడైంది.
ఈ కేసులో మద్యం సిండికేట్, స్థానిక కాంట్రాక్టర్లకు మధ్య మీడియేటర్‌గా ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. తన తండ్రి కారుమూరి నాగేశ్వరరావుకు ఉన్న రాజకీయ పలుకుబడితో.. మద్యం రవాణాకు సంబంధించిన సబ్ కాంట్రాక్టులు దక్కించుకున్నారని కారుమూరి సునీల్‌పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టులో అతడిని హాజరు పరచనున్నారు. ఆ తర్వాత విచారణ కోసం సునీల్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ అధికారులు కోరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక హైదరాబాద్‌లో కారుమూరి సునీల్‌ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. ఆయనకు మెడికల్ టెస్ట్‌లు చేసిన తర్వాత నాంపల్లిలోని