
తిరుపతి చేపల మార్కెట్లో కుళ్లిపోయిన చేపలు, రొయ్యలు అమ్ముతున్న దుకాణాలను నగరపాలక సంస్థ అధికారులు సీజ్ చేశారు. వారం రోజులుగా తిరుపతిలో మాంసాహర దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ఇవాళ లీలామహల్ సమీపంలోని చేపల మార్కెట్లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు.
రెండు దుకాణాలలో కుళ్లిన చేపలు, రొయ్యలు గుర్తించి సీజ్ చేశారు. తమకు ఫిర్యాదులు రావడంతో చేపల మార్కెట్లో తనిఖీలు చేసినట్లు హెల్త్ ఆఫీసర్ అన్వేశ్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న దుకాణాలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ వార్త చదివారా: 20,876 కేజీల గంజాయి దగ్ధం