
ఇంటర్నెట్ డెస్క్: శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ‘భోగి’ చిత్రం రానున్న విషయం తెలిసిందే. ఆగస్టు 28న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు (Sampath Nandi) ఓ ప్రత్యేక పోస్ట్ పెట్టారు. 24 గంటల నుంచి తాను ఈ సినిమాలోని ఎమోషన్స్ నుంచి బయటకు రాలేకపోతున్నానన్నారు.
‘‘ఈ సినిమాలోని (Bhogi) భావోద్వేగాలు నా మనసును కదిలిస్తున్నాయి. 24 గంటల నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తూనే ఉన్నా. అయినా సాధ్యపడడం లేదు. గత పదేళ్లలో శర్వానంద్ ఇంత గొప్పగా ఎప్పుడూ నటించలేదు. ప్రత్యేకంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన మునుపెన్నడూ చూడనంత గొప్పగా నటించారు.
కొన్ని సందర్భాల్లో నేను కట్ చెప్పడం కూడా మర్చిపోయాను. సెట్లో ఉన్న 200 మంది కళ్లు తుడుచుకుంటూ చప్పట్లు కొడుతూనే ఉన్నారు. ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. నా కెరీర్లో ఇలాంటి అనుభవం పొందడం ఇదే మొదటిసారి. నన్ను నమ్మండి.. ఈ మాటలు గుర్తుంచుకోండి..
మీరు కూడా థియేటర్లో ఈ సినిమా చూస్తున్నప్పుడు మీకు తెలియకుండానే భావోద్వేగానికి గురవుతారు’’ అని సంపత్ నంది తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఉత్తర తెలంగాణ - మహారాష్ట్ర ప్రాంతాలతో ముడిపడిన ఈ పీరియాడిక్ కథని పాన్ ఇండియా స్థాయిలో తెర పైకి తీసుకొస్తున్నారు.
శర్వాకు జోడీగా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి నటిస్తున్నారు. ‘కందుల సులోచన రాణి’గా అనుపమ కనిపించనుండగా.. మందారం అనే బోల్డ్ పాత్రలో డింపుల్ నటిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.
శ్రీవారిని ‘మా ఇంటి బంగారం’ చిత్రబృందం దర్శించుకుంది.
ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. తిరుమల