
Phonepe wallet | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పేపై ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతోంది. ఏడాది పాటు ఎలాంటి లావాదేవీలూ జరపని వాలెట్లపై ఛార్జీలు వసూలు చేస్తామంటూ ఆ సంస్థ వినియోగదారులకు సందేశాలు పంపిస్తోంది.
దీనిపై యూజర్లు భగ్గుమంటున్నారు. వాలెట్ ఉండడమే నేరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. తమకు ఫోన్‌పే నుంచి వచ్చిన సందేశాలను సామాజిక వేదికగా పోస్ట్ చేస్తున్నారు. ఏడాది పాటు ఎలాంటి డిజిటల్ చెల్లింపులు చేయని ఫోన్‌పే వాలెట్లపై ఛార్జీలు వసూలుచేస్తామని ఫోన్‌పే సందేశాలు పంపిస్తోంది.
వీటిని ఇనాక్టివేట్ వాలెట్‌గా పరిగణించి నిర్వహణ ఛార్జీల పేరిట 3 నెలలకు రూ.100 చొప్పున వసూలు చేస్తామని అందులో పేర్కొంది. ఛార్జీల విషయాన్ని కంపెనీ తన టర్మ్స్ అండ్ కండీషన్స్‌లోనూ తెలిపింది. అయితే, మూడు నెలలకోసారి ఫీజు వసూలుచేస్తామని వెల్లడించినప్పటికీ..
ఎంతనేది అందులో పేర్కొనలేదు. 15 రోజుల ముందుగానే యూజర్లకు నోటిఫికేషన్ అలర్ట్ జారీ చేస్తున్నామని, ఈలోపు వాలెట్ యాక్టివేట్ చేసుకుంటే అదనపు రుసుముల భారం తప్పుతుందని తెలిపింది. యాప్ వాడినంత మాత్రాన వాలెట్ యాక్టివేట్‌లో ఉన్నట్లు కాదని పేర్కొంది.
వసూలు చేసిన ఛార్జీలను కంపెనీ కార్యకలపాలకు వినియోగిస్తామని పేర్కొంది. మెసేజ్‌లకు వాట్సప్ ఎలా మారిందో చెల్లింపులకు ఫోన్‌పే అలా నిత్యజీవితంలో భాగమైపోయింది. ఇందులో యూపీఐ లావాదేవీలు చేసే వారే అధికం. కొందరైతే ఫోన్‌పేలో యూపీఐ లైట్‌ను వాలెట్‌లా వినియోగిస్తుంటారు.
దీంతో వాలెట్లు వాడే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందనే చెప్పాలి. కొందరికైతే చివరిసారిగా ఎప్పుడు వాడేమో కూడా తెలీడం లేదు. అలాంటి వాడనంత మాత్రన ఛార్జీలు వసూలుచేయడం దోపిడీనే అవుతుందని విమర్శిస్తున్నారు. కొందరైతే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)ను ట్యాగ్ చేస్తూ ఫోన్‌పై నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.
లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
కృత్రిమ మేధతో ఉద్యోగాలు పోతాయనే ఆందోళనల మధ్య అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ సరికొత్త విశ్లేషణ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు