
వినూత్నమైన కంటెంట్ చేయాలి. వీక్షకుల్ని ఆకట్టుకోవాలి. ఇవే లక్ష్యాలు సామాజిక మాధ్యమాల్లో కంటెంట్ క్రియేటర్లకు. కోమల్ ఆద్య కూడా ఆ కోవకు చెందిన అమ్మాయే. బిహార్ ఈమెది. వినూత్నమైన కంటెంట్ చేయాలి.
వీక్షకుల్ని ఆకట్టుకోవాలి. ఇవే లక్ష్యాలు సామాజిక మాధ్యమాల్లో కంటెంట్ క్రియేటర్లకు. కోమల్ ఆద్య కూడా ఆ కోవకు చెందిన అమ్మాయే. బిహార్ ఈమెది. నటన, డ్యాన్స్ అంటే ఇష్టం. అందుకే సంప్రదాయ నృత్య రీతుల్ని నేర్చుకుంది. వీటితోపాటు కామెడీ వీడియోలు చేయడంలో దిట్ట ఈమె. హాస్యం అంటే డార్క్ కామెడీ అనుకునేరు... ఇరుగూ పొరుగూ కలిసి పక్కన ఉన్న మహిళను ఇమిటెడ్ చేయడం, తిట్టుకుంటూ నొచ్చుకుంటూ బయటికి కలుపుగొలుగా ఎలా ఉంటారో చెప్పడం, ఉదయాన్నే అమ్మ పిల్లల్ని నిద్రలేపే విధానం... ఫోనే అన్ని సమస్యలకు కారణమంటూ అమ్మ తిట్టే తిట్లు ఇవే ఆమె కంటెంట్. ఆ వీడియోలతోనే వేల మంది ఫాలోయర్లను సంపాదించుకుందీ అమ్మాయి. ఈ క్రమంలోనే తనో రీల్ చేసింది. మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా ఈ ఏడాది విడుదలైన ‘మైఖేల్’ చిత్రాన్ని వాళ్ల అమ్మ గనక చూసి ఉంటే... తర్వాత ఆమె పరిస్థితి ఎలా ఉండేదో ఊహిస్తూ చేసిన వీడియో అది. బిహారీ చీరకట్టులో, రూపాయి బిళ్లంత బొట్టు పెట్టుకుని... మైఖేల్ జాక్సన్ ఆల్ టైమ్ హిట్ ‘బిల్లీ జీన్’ పాటకు స్టెప్పులేసింది. కష్టమైన స్టెప్పులూ, మూన్ వాక్ వంటివి... చీరకట్టులో అలవోకగా చేయడంతో ఆ వీడియో కాస్తా వైరలైంది. వీక్షకుల మన్ననలూ అందుకుంది. లక్షల వ్యూస్‌ని సంపాదించుకుంటోందీ వీడియో.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.