
OnePlus Pad 2 Amazon Offer: అమెజాన్‌లో వన్‌ప్లస్ ప్యాడ్ 2 ట్యాబ్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తోంది. దీనిని ఇప్పుడే కొనుగోలు చేసేవారికి ఫ్లాట్ తగ్గింపుతో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి పేమెంట్ చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది.
OnePlus Pad 2 Amazon Offer: ప్రముఖ ఈ కామర్స్ అమెజాన్‌లో అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా డే సేల్‌లో భాగంగా ప్రతి బ్రాండ్‌కి సంబంధించిన వస్తువులపై స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్లాగ్షిప్ ఫీచర్లతో కూడి స్మార్ట్ఫోన్స్తో పాటు ట్యాబ్స్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు.
ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి వెరీ చీప్ ధరలకే సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా అమెజాన్ డే సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ ప్యాడ్ 2 (OnePlus Pad 2) స్మార్ట్ ట్యాబ్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్‌గా భావించవచ్చు. ఇది ఎన్నో రకాల అద్భుతమైన ఫ్లాగ్షిప్ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది.
ముఖ్యంగా ఇది ఎన్నో రకాల స్పెషల్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. అయితే, ఈ దీనిపై ఉన్న ఆఫర్స్‌తో పాటు ఫీచర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వన్‌ప్లస్ ప్యాడ్ 2 (OnePlus Pad 2) ట్యాబ్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే..
ఇది 12.1 అంగుళాల 3K LCD డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా 7:5 రీడ్ఫిట్ రేషియో, 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది గేమింగ్‌తో పాటు స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. అంతేకాకుండా 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్‌ట్యాబ్ ఎంతో శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 (Snapdragon 8 Gen 3) ఫ్లాగ్షిప్ ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది 6 ఓమ్నీబేరింగ్ స్పీకర్లు (Omnibearing Speakers) ఆడియో సపోర్ట్‌తో లభించడం
విశేషం.. ఈ ట్యాబ్ 9510 mAh భారీ బ్యాటరీ, 67W SUPERVOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది.
ఈ స్మార్ట్ ట్యాబ్ వెనక భాగంలో 13 MP బ్యాక్ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ముందు భాగంలో 8 MP ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఆక్సిజన్ OS 14.1 ఆండ్రాయిడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో కంపెనీ చాలా ప్రత్యేకమైన AI టూల్‌బాక్స్ (AI Toolbox)ను అందిస్తోంది. ఇది ఫొటోల నుంచి అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్‌ను తీసేయడానికి AI Eraser 2.0, ఆడియో రికార్డింగ్స్‌ను టెక్స్ట్‌గా మార్చే AI Summaryతో పాటు కంటెంట్ రాయడానికి AI Writer లాంటి స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది.
ఇందులో కంపెనీ సెల్యులార్ డేటా షేరింగ్ (Cellular Data Sharing) సపోర్ట్‌ను కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ వై-ఫై టాబ్లెట్‌లో సిమ్ కార్డ్ స్లాట్ లేకపోయినా.. మీ వన్‌ప్లస్ ఫోన్ సెల్యులార్ డేటా, ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను వన్-క్లిక్‌తో షేర్ చేసుకునే అవకాశం అందుబాటులో ఉంది..ఇందులో ఓపెన్ కాన్వాస్ (Open Canvas) ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. దీని వల్ల స్క్రీన్‌పై ఒకేసారి మూడు యాప్స్‌ను ఎలాంటి లాగ్ లేకుండా మల్టీటాస్కింగ్ కోసం వాడుకోవచ్చు.
ఇక భారత మార్కెట్లో వన్‌ప్లస్ ప్యాడ్ 2 (12GB RAM + 256GB స్టోరేజ్) వేరియంట్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. ఇది MRP ధర రూ.47,999తో అందుబాటులో ఉంది. అయితే, దీనినే అమెజాన్‌లో ఇప్పుడే కొనుగోలు చేసేవారికి 25 శాతం వరకు ఫ్లాట్ తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు రూ.35,999కే సొంతం చేసుకోవచ్చు. ఇవే కాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
బ్యాంక్ ఆఫర్స్‌కి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. SBI బ్యాంక్‌కి సంబంధించిన క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేసేవారికి రూ.400 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన కొన్ని క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.2 వేల వరకు డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది.
ఇవే కాకుండా అదనంగా ఎక్చేంజ్ బోనస్ డిస్కౌంట్ లబిస్తోంది. ఇందులో భాగంగా ఏదైన బ్రాండ్‌కి సంబంధించిన స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్‌ను ఎక్చేంజ్ చేస్తే.. దాని కండీషన్‌ను బట్టి దాదాపు రూ.32,500 వరకు బోనస్ కూడా లభిస్తుంది. దీంతో ఈ బోనస్ ట్యాబ్ ధర నుంచి మైనస్ చేస్తే దాదాపు రూ.3,499కే దీనిని సొంతం చేసుకోవచ్చు. దీనిపై ఇవే కాకుండా ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.