
Tata Motors: ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ (TMCV) తమ వినియోగదారులకు గట్టి షాక్ ఇచ్చింది. వచ్చే నెల జులై 1వ తేదీ నుంచి తమ వాణిజ్య వాహనాల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటన విడుదల చేస్తూ..
అన్ని రకాల వాణిజ్య వాహనాలపై ధరల భారం పడనుందని స్పష్టం చేసింది. Read also: Petrol, Diesel Price Today: దేశవ్యాప్తంగా స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు తాజా ప్రకటన ప్రకారం.. జులై 1 నుంచి టాటా కమర్షియల్ వాహనాల ధరలు 2.5 శాతం వరకు పెరగనున్నాయి.
మార్కెట్లో నిరంతరం పెరుగుతున్న వస్తువుల ధరలు, ఇన్పుట్ వ్యయాలు (తయారీ ఖర్చులు) భారీగా పెరిగిపోవడాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సంస్థ వెల్లడించింది. అయితే, ఈ ధరల పెంపు అనేది వాహనాల మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి మారుతుందని టాటా మోటార్స్ పేర్కొంది.
టాటా మోటార్స్ కమర్షియల్ వాహనాల కంటే ముందే తమ ప్రయాణికుల (ప్యాసింజర్) వాహనాల ధరలను కూడా పెంచిన సంగతి తెలిసిందే. అప్పట్లో ప్యాసింజర్ కార్లు, ఈవీ వాహనాలపై దాదాపు 1.5 శాతం వరకు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కమర్షియల్ వాహనాల ధరలు కూడా రేసింగ్‌కు సిద్ధమవడంతో లారీలు, టెంపోలు, ఇతర రవాణా వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారిపై అదనపు భారం పడనుంది.
Indian Tourist Killed : న్యూయార్క్ లో గుర్రపు బండి ప్రమాదం: భారతీయ పర్యాటకుడు మృతి గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Mumbai Crime: సీసీ కెమెరాలు పెట్టి వేధింపులు.. పెళ్లయిన 48 రోజులకే వివాహిత ఆత్మహత్య! Lord Sri Rama in Bangladesh: ఇస్లామిక్ మూకల
బెదిరింపులతో బంగ్లాదేశ్‌లో శ్రీరాముడి విగ్రహ నిర్మాణం నిలిపివేత!
Tamil Nadu Assembly: తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో వందేమాతరం తొలగింపు?
PM Kisan: రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు.. కేంద్రం ప్రకటన!
USCIS’s tough decision: గ్రీన్ కార్డ్ ఆశలపై యూఎస్సీఐఎస్ నీళ్లు