
అందాన్ని పెంచే 6 కూరగాయలు.. మీ డైట్లో పక్కా ఉండాల్సిందే!అందాన్ని పెంచే 6 కూరగాయలు.. మీ డైట్లో పక్కా ఉండాల్సిందే! 17 Jun 2026 Anand T చిన్న వయస్సులోనే ముడతల చర్మంతో బాధపడుతున్నారా? అయితే ఈ 6 కూరగాయలను క్రమం తప్పకుండా తినడం రిజల్ట్స్ మీరే గమనిస్తారు.
పాలకూరలో విటమిన్ సి, కాల్షియం,యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం స్థితిస్థాపకతను,దృఢత్వాన్ని కాపాడతాయి. టమాటాలలో ఉండే లైకోపీన్, విటమిన్ సి చర్మాన్ని హానికరమైన సూర్యకిరణాలు, కాలుష్యం నుండి కాపాడతాయి. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది బ్రోకలీలో విటమిన్ సి, విటమిన్ కె, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి.
ఇవి చర్మ కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుండి రక్షణ కల్పిస్తాయి. క్యాప్సికమ్‌లో విటమిన్ సి, విటమిన్ ఎ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మంలోని తేమను కోల్పోకుండా కాపాడి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పచ్చి బీన్స్‌లో విటమిన్ సి, బి విటమిన్లు, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి.
ఇవి చర్మానికి లోపలి నుండి అవసరమైన పోషణను అందిస్తాయి. క్యారెట్లలోని బీటా-కెరోటిన్, విటమిన్ ఎ చర్మాన్ని యూవీ కిరణాల నుండి రక్షిస్తాయి. అలాగే ఇవి చర్మంపై వచ్చే మొటిమలను, వాపులను తగ్గిస్తాయి ఈ కూరగాయల పూర్తి ప్రయోజనాలు లభించాలంటే..
వీటిని సలాడ్లు, సూప్‌లు, జ్యూస్‌ల రూపంలో లేదా కొద్దిగా ఉడికించి తీసుకోవడం మంచిది. మరిన్ని వెబ్ స్టోరీస్ తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా? రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి చీరలో అందంగా.
మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్