
ఇంటర్నెట్ డెస్క్: కథానాయకుడు వెంకటేశ్.. దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి సంక్రాంతి బరిలో వినోదాలు పంచేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. అనిల్ దర్శకత్వంలో వెంకటేశ్ (Venkatesh), కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా రానుంది.
‘VenkyAnil5’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఇది ప్రచారంలో ఉంది. ఈ చిత్రం షూటింగ్ నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రాఘవేంద్రరావు, దిల్‌రాజు, సురేశ్ బాబు, అల్లు అరవింద్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తొలి షాట్ చిత్రీకరణ జరగ్గా..
ఈ సినిమా రూ.200 కోట్లు వసూళ్లు సాధించాలని కోరుకుంటూ అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. దిల్‌రాజు స్క్రిప్ట్ అందించి టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇందులో వెంకటేశ్‌కు జోడీగా కీర్తి సురేశ్, కల్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటిస్తున్నారు.
వెంకటేశ్ - అనిల్ రావిపూడి కాంబినేషన్లో గతేడాది పండక్కి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ బరిలో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జోష్‌తో మరోసారి నవ్వులు పంచేందుకు సిద్ధమయ్యారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు.
2027 సంక్రాంతి లక్ష్యంగా శరవేగంగా షూటింగ్ జరగనుంది. ఇక వెంకటేశ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం - హౌస్ నెం:47’ అనే సినిమా చేస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.
.
ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు