
Jananayagan Movie: తమిళనాడు ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో బిజీ కావడానికి ముందు.. కోలీవుడ్ స్టార్ హీరో జోసఫ్ విజయ్ (దళపతి విజయ్) నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’.
ఎన్నో వాయిదాల తర్వాత ఈ మోస్ట్ అవేటెడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ విడుదలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ బయటకు వచ్చింది. అన్ని అడ్డంకులు తొలగిపోతే ఈ సినిమాను జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ విడుదల అనేది పూర్తిగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఇచ్చే క్లియరెన్స్‌పైనే ఆధారపడి ఉంది.
Read also: Samantha Meets CM Vijay : సీఎం విజయ్ ని కలిసిన సమంత
ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. జూన్ 19 (శుక్రవారం) నాటికి సెన్సార్ బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంగా ఉంది. ఒకవేళ ఎలాంటి కట్స్ లేకుండా సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తయితే జూన్ 26న రిలీజ్ ఖాయం కానుంది. అయితే, ఒకవేళ జూన్ 22 లోపు సెన్సార్ అనుమతులు రాకపోతే.. డిస్ట్రిబ్యూటర్ల నుంచి తీసుకున్న అడ్వాన్స్ మొత్తాలను తిరిగి ఇచ్చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు టాక్. ఈ పరిస్థితుల్లో నిర్మాతలకు అండగా నిలిచేందుకు సీఎం విజయ్ సైతం తన రెమ్యూనరేషన్‌ను వెనక్కి ఇచ్చేందుకు అంగీకరించినట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ప్రతిభావంతుడైన దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే, మమిత బైజు కథానాయికలుగా నటించగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
నిజానికి ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9నే విడుదల చేయాల్సింది. కానీ, 2025 డిసెంబర్లో సెన్సార్ బోర్డు ముందుకు వెళ్లినప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్‌కు గ్రహణం పట్టింది. పలు ఫిర్యాదులు, రివైజింగ్ కమిటీ స్క్రీనింగ్స్, మద్రాస్ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు వరకు వెళ్లిన న్యాయపోరాటాలు.. వీటన్నిటికీ తోడు ఏప్రిల్ నెలలో సినిమా ఆన్లైన్లో లీక్ అవ్వడం వంటి వరుస షాక్‌లతో ఈ చిత్రం నెలల తరబడి వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు జూన్ చివరి వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
AP Govt Doctors Dismissed: ఏపీలో విధులకు గైర్హాజరైన 43 మంది డాక్టర్ల తొలగింపు
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Samantha Meets CM Vijay : సీఎం విజయ్ ని కలిసిన సమంత
Venky -Anil Ravipudi Movie : వెంకీ-అనిల్ రావిపూడి మూవీ టైటిల్ ఫిక్స్ అయినట్లేనా ?
Keerthy Suresh Sathyavan Savithri Movie: కీర్తి సురేష్ ‘సత్యవాన్ సావిత్రి’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
Adarsha Kutumbam Movie: త్రివిక్రమ్ – వెంకటేష్ మూవీ ‘ఆదర్శ కుటుంబం’ లో భారీ మార్పులు!
Singeetham Movie: ‘సింగ్ గీతం’ ఓటీటీ రిలీజ్లో నాగ్ అశ్విన్ కీలక మార్పులు!
Ramani Kalyanam Movie: ఓటీటీలోకి వచ్చేసిన ‘రమణి కల్యాణం’