
భారత యువ సంచలనం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఎంతగా వార్తల్లో నిలుస్తున్నాడో, ఇప్పుడు అతని మానసిక దృఢత్వం గురించి కూడా అంతే చర్చ జరుగుతోంది. ఇటీవల శ్రీలంక 'ఏ' జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థుల స్లెడ్జింగ్‌కు దూకుడుగా స్పందించిన ఘటనతో భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా అతనికి 'సిట్యుయేషన్ మేనేజ్మెంట్'లో ప్రత్యేక శిక్షణ అవసరమని క్రీడా నిపుణులు, మానసికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.క్రికెట్లో వైభవ్ స్థాయి పెరిగేకొద్దీ, ప్రత్యర్థి జట్లు అతని ఏకాగ్రతను దెబ్బతీయడానికి, ఒత్తిడికి గురిచేయడానికి స్లెడ్జింగ్ వంటి మానసిక ఎత్తుగడలను ప్రయోగిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితులను తట్టుకుని నిలబడాలంటే కేవలం ప్రతిభ మాత్రమే సరిపోదని, అపారమైన మానసిక స్థైర్యం కూడా అవసరమని స్పష్టం చేస్తున్నారు.ఎన్సీఏలో ఇప్పటికే శిక్షణ..ప్రముఖ స్పోర్ట్స్ సైకాలజిస్ట్ డాక్టర్ స్వరూప్ సవనూర్ పీటీఐతో మాట్లాడుతూ.. "నేను రెండు, మూడేళ్ల క్రితం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో అండర్-16 కుర్రాళ్లకు శిక్షణ ఇచ్చినప్పుడు వైభవ్‌తో పనిచేశాను.
అతను చాలా ప్రశాంతమైన కుర్రాడు. వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని ఎన్సీఏ, బీసీసీఐలకు యువ ఆటగాళ్ల మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత గురించి తెలుసు. అందుకే క్యాంపులు నిర్వహించినప్పుడు క్రీడాకారులకు స్పోర్ట్స్ సైకాలజీ సేవలు అందిస్తున్నారు" అని తెలిపారు.
గతంలో రాహుల్ ద్రవిడ్ ఎన్సీఏ హెడ్‌గా ఉన్నప్పుడు కూడా తాను యువ క్రికెటర్ల కోసం 18-19 హై-పెర్ఫార్మెన్స్ క్యాంపులు నిర్వహించానని ఆయన గుర్తుచేశారు.ప్రతిభ ఒక్కటే సరిపోదు..అండర్-19 స్థాయిలో అద్భుతంగా రాణించిన ఎందరో ఆటగాళ్లు, సీనియర్ స్థాయికి వచ్చేసరికి అదే విజయాన్ని అందుకోలేకపోతున్నారని డాక్టర్ సవనూర్