
Raj Nidimoru Net Worth: సమంత ప్రస్తుతం తన తొలి నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న మా ఇంటి బంగారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సమంత వ్యక్తిగత జీవితం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ముఖ్యంగా దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె వివాహం తర్వాత నుంచి అతని ఆస్తిల వివరాల గురించి ఎంతోమంది తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. సమంత భర్త రాజ్ నిడిమోరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి కావడం విశేషం. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో జన్మించారు.
బీటెక్ చదివే సమయంలో కృష్ణ డీకేతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తరువాత ఇద్దరూ కలిసి సినిమా రంగంలోకి అడుగుపెట్టి విజయవంతమైన దర్శకులుగా గుర్తింపు పొందారు. రాజ్-డీకే జోడీ రూపొందించిన ది ఫ్యామిలీ మ్యాన్, గన్స్ అండ్ గులాబ్స్, స్ట్రీ, షోర్ ఇన్ ది సిటీ వంటి ప్రాజెక్టులు మంచి విజయాలు సాధించాయి.
వివిధ మీడియా కథనాల ప్రకారం రాజ్ నిడిమోరు ఆస్తుల విలువ సుమారు రూ.85 నుంచి రూ.89 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం. దర్శకుడు, నిర్మాత, రచయితగా ఆయన సంపాదించిన ఆదాయమే ఈ స్థాయికి చేరడానికి కారణమని చెబుతున్నారు. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు.
ఇటీవల సమంత, రాజ్ నిడిమోరు వివాహం, కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో ఉన్న లింగ భైరవి ఆలయంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎర్రటి చీరలో సమంత ఎంతో అందంగా కనిపించగా, రాజ్ తెలుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.
సమంత ధరించిన ప్రత్యేకమైన ఉంగరం కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఈ ఫోటోలపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. సమంత, రాజ్ మధ్య ఎన్నో ఏళ్లగా స్నేహం ఉండేది. ది ఫ్యామిలీ మ్యాన్
2, సిటాడెల్: హనీ బన్నీ వంటి ప్రాజెక్టుల సమయంలో వీరి మధ్య మంచి అనుబంధం ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. అలాగే సమంత నిర్మించిన శుభం చిత్రానికి కూడా రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు.
ఇక మా ఇంటి బంగారం విడుదలకు సిద్ధమవుతుండటంతో సమంత కెరీర్‌తో పాటు ఆమె వ్యక్తిగత జీవితంపై కూడా అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.