
మహేశ్‌బాబు ‘1 నేనొక్కడినే’తో తెరంగేట్రం చేసిన కృతి సనన్.. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. తాజాగా కాక్టెయిల్-2తో ప్రేక్షకులముందుకు రానుంది. నటిగా తనను తాను నిరూపించుకొని ‘మిమి’తో జాతీయ అవార్డు అందుకున్న కృతి..
ఇటీవల ఓ ఇంటర్వ్యూల్లో చెప్పిన ముచ్చట్లివీ.. ‘‘నేను ఫేమ్ కోసం పాకులాడను. ఏం చేసినా అందులో ఉత్తమంగా ఉండేలా చూసుకుంటా. నా ప్రతిభను మెచ్చుకుంటే సంతోషపడతా’’ ‘‘సోషల్‌మీడియా యుగంలో ఎవరైనా తొందరగా ఫేమస్ కావొచ్చు. అయితే, ప్రజలు మనల్ని ఎలా గుర్తుపెట్టుకుంటారనేదే చాలా ముఖ్యం’’ ‘‘ఒక సినిమా తర్వాత ఏం చేయాలనేదాని గురించి పెద్దగా ఆలోచించను.
కానీ, తదుపరి చేసే పాత్రలు నాకు సవాలుగా ఉండాలనుకుంటా’’ ‘‘సోషల్ మీడియాలో నాపై వచ్చే విమర్శలను పెద్దగా పట్టించుకోను. ఎవరైనా ఎక్కువ ట్రోల్ చేసినా, నెగటివ్‌గా మాట్లాడినా వాళ్లని బ్లాక్ చేస్తా’’ ‘‘80s, 90sలో మహిళలకు బలమైన పాత్రలుండేవి.
ఆ తర్వాత హీరో సెంట్రిక్ చిత్రాలొచ్చాయి. ఇప్పుడు నటీమణులు మళ్లీ మంచి పాత్రలు చేస్తున్నారు’’ ‘‘వేరే పనులు చేసేందుకు నాకు అసలు సమయం ఉండట్లేదు. బెల్లీ డ్యాన్సింగ్, పోల్ డ్యాన్సింగ్, పాటరీ, పియానో నేర్చుకోవాలని ఉంది’’ ‘‘రష్మిక మందన ఎంతో అద్భుతమైన నటి.
వృత్తిపరంగా తోటి నటులతో ఆమెకు ఎలాంటి అభద్రతాభావం లేదు. నిజాయితీగా ఉంటుంది’’అని కృతి చెప్పుకొచ్చింది
.