
Pawan Kalyan | ఇంటర్నెట్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బుధవారం హనుమకొండలో పర్యటించారు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్(17) అనే బాలుడు తనకు అభిమాని అని, తనను కలవాలన్న అతడి ఆకాంక్షను తెలుసుకున్న పవన్..
ఈ ఉదయం నేరుగా బాలుడి నివాసానికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. తన పర్యటనకు సంబంధించిన ఫొటోలతో ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ‘‘కొద్ది రోజుల క్రితం వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన నిరంజన్ అనే బాలుడు అరుదైన వ్యాధితో పోరాడుతూ నన్ను కలవాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన వీడియోను చూశాను.
నిరంజన్ ఆకాంక్షను నెరవేర్చాలని భావించాను. ఈరోజు హనుమకొండలోని అతని నివాసానికి వెళ్లి పరామర్శించాను. అరుదైన వ్యాధితో చేస్తున్న పోరాటంలో అతడి అసాధారణ ధైర్యం, ఆత్మవిశ్వాసం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న తీరు స్ఫూర్తిదాయకం.
తీవ్రమైన అనారోగ్య సమస్యల మధ్య నిరంజన్ చూపుతున్న మనోధైర్యం ప్రశంసనీయం. నిరంజన్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రార్థించాను. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు అతనిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.
భగవంతుని ఆశీస్సులతో నిరంజన్ త్వరగా కోలుకోవాలి. ప్రియమైన నిరంజన్.. నీ ధైర్యం నీ కష్టాలకంటే గొప్పది. త్వరలో నిన్ను సంపూర్ణ ఆరోగ్యంతో, చిరునవ్వుతో, మరింత ఉత్సాహంగా చూడాలని కోరుకుంటున్నాను. అదే సమయంలో వరంగల్, హనుమకొండ పర్యటనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖకు కృతజ్ఞతలు.
తెలంగాణ ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, అభిమానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలు, ప్రేమ నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయి. నాపై మీ మమకారాన్ని జీవితాంతం నా హృదయాంతరాల్లో నిలుపుకొంటాను’’ అని పేర్కొన్నారు.
ఇంటి ఓనర్స్ అనుమతి కావాలని నిరంజన్ తండ్రి చెప్పగా, స్వయంగా ఆ ఇంటి ఓనర్స్ని పిలిపించి మాట్లాడారు. నిరంజన్ తల్లిదండ్రుల వృత్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో కాకతీయ ఆసుపత్రి క్యాంటీన్లో పని చేసేవాళ్లమని చెప్పగా, వారి జీవనోపాధి మెరుగుపర్చేందుకు క్యాంటిన్ పెట్టించాలని జనసేన తెలంగాణ రాష్ట్ర నేతలకు సూచించారు. నిరంజన్ పరామర్శ పూర్తయిన వెంటనే పవన్ వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయన వెంట జనసేన నేతలు శంకర్ గౌడ్, శ్రీరామ్ తాళ్లూరి, రాధారం రాజలింగం, ఆర్ కె సాగర్ తదితరులు ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
విశాఖలోని రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించింది.
ఏపీ హోంమంత్రి అనిత (Anitha) మరోసారి మానవత్వం చాటుకున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వరంగల్లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వైకాపా నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా నిరంజన్ ఓ కుక్క పిల్ల బొమ్మ చూపించి దాన్ని పెంచుకోవాలని ఉందని చెప్పగా, కొని పంపుతానని పవన్ హామీ ఇచ్చారు. కుక్కను పెంచుకోవడానికి