
India vs Afghanistan Match : భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో విరుచుకుపడ్డారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అఫ్గాన్ బౌలర్లను ముప్పతిప్పలు పెడుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు.
కెప్టెన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడిన గిల్ కేవలం అఫ్గాన్ బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ 154 పరుగుల భారీ సెంచరీతో జట్టును ముందుండి నడిపించాడు. మరోవైపు అతనికి తోడుగా ఇషాన్ కిషన్ (125) సైతం మెరుపు సెంచరీతో టీమ్ ఇండియాకు భారీ పునాది వేశాడు.
వీరిద్దరి సునామీ ఇన్నింగ్స్‌ల ధాటికి ఒక దశలో భారత స్కోరు 450 పరుగులు దాటుతుందని భావించినప్పటికీ, వీరిద్దరూ అవుట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. Read Also : తెలివితేటలు మామూలుగా లేవుగా.. మొబైల్ ఫోన్ కవర్లో మద్యం దాచి స్టేడియంలోకి!
సెంచరీ వీరులు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ పెవిలియన్ చేరిన తర్వాత భారత మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఆ జోరును కొనసాగించడంలో ఘోరంగా విఫలమయ్యారు. శ్రేయస్ అయ్యర్ (26) కాసేపు క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు.
ఆ తర్వాత వచ్చిన స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సున్నా (0) పరుగులకే వెనుదిరిగి తీవ్రంగా నిరాశపరచగా, హర్‌ప్రీత్ బ్రార్ కేవలం 3 పరుగులకే ఔటయ్యాడు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో ఖరోటి చాకచక్యంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టగా, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 3 వికెట్లతో భారత ఇన్నింగ్స్‌ను నియంత్రించాడు.
దీంతో భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌట్ అయి, అఫ్గాన్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. Khammam : ముగ్గురు మంత్రులు మోసగాళ్లే – కేటీఆర్ గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం.
చేస్తాము.
Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు టీసీఏ లీగల్ నోటీసు.. ఎందుకు?
Rohit Sharma Record: 14000 పరుగుల క్లబ్లో హిట్‌మ్యాన్ సంచలనం.. సిక్సర్‌తో అరుదైన రికార్డ్!
Vishen Halambage Ban: వైభవ్ తో గొడవ.. లంక ప్లేయర్ హలంబగేపై 2 మ్యాచ్‌ల నిషేధం!
FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్‌లో ఎంబాపే రికార్డు.. మెస్సి, క్లోజే రికార్డులకు చెక్ పెడతాడా?
FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్‌లో మెస్సీ హ్యాట్రిక్.. బోణీ కొట్టిన అర్జెంటీనా
TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి