
ముక్కోణపు సిరీస్లో అఫ్గానిస్థాన్-ఎతో జరిగిన వన్డే మ్యాచ్లో భారత్-ఎ ఘన విజయం సాధించింది. 320 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన అఫ్గాన్-ఎ.. 36.5 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది. బహీర్ షా 57, షినోజాదా 46, ఇమ్రాన్ మిర్ 32 రన్స్ చేశారు.
భారత్-ఎ బౌలర్లలో నిశాంత్ సింధు 4, యశ్ ఠాకూర్ 2 వికెట్లు పడగొట్టారు. అన్షుల్ కాంబోజ్, విప్రాజ్ నిగమ్, సూర్యాంశ్, అనుకల్ రాయ్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో భారత్-ఎ ఫైనల్కు దూసుకెళ్లింది. అఫ్గాన్-ఎపై ఘనవిజయం.. ఫైనల్కు భారత్-ఎ
|