
విజయవంతమైన వ్యాపారవేత్తల జీవితంలో ఎన్నో కఠినమైన అనుభవాలు, కష్టపడి పనిచేసిన రోజులు ఉంటాయి. అమెరికాకు చెందిన ఏఐ భద్రతా సంస్థ డీప్ సెంటినెల్ సీఈవో డేవిడ్ సెలింగర్ కూడా అలాంటి అనుభవాలనే గుర్తు చేసుకున్నారు. ఆయన తన కెరీర్ ప్రారంభ దశలో అమెజాన్‌లో పనిచేసిన రోజులను గుర్తు చేసుకుంటూ, సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ నాయకత్వం తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చిందని చెప్పారు.
డేవిడ్ సెలింగర్ 2002లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా అమెజాన్‌లో ఉద్యోగం పొందారు. 2003 జనవరిలో కంపెనీలో చేరి.. కస్టమర్ కస్టమర్ బిహేవియర్ రోల్ విభాగంలో పనిచేశారు. ఆ సమయంలో అమెజాన్ ఇప్పటిలా లక్షలాది ఉద్యోగులతో కూడిన దిగ్గజ సంస్థ కాదు.
కొద్దిమంది ఉద్యోగులతో పనిచేస్తున్నప్పటికీ, భారీ స్థాయిలో డేటాను విశ్లేషించే అవకాశాలు అక్కడ ఉండేవని ఆయన తెలిపారు. అమెజాన్‌లో పనిచేసే సమయంలో జెఫ్ బెజోస్‌ను వారానికి ఒకటి లేదా రెండు సార్లు కలిసేవాడినని సెలింగర్ చెప్పారు. బెజోస్ గురించి మాట్లాడుతూ..
ఆయన ఎంతో శక్తివంతమైన, లక్ష్యసాధనపై పూర్తిగా దృష్టి పెట్టే నాయకుడని పేర్కొన్నారు. “ఆయనతో పనిచేయడం అద్భుతమైన అనుభవం” అని సెలింగర్ అన్నారు. అమెజాన్‌లోని పని సంస్కృతి కూడా అంతే కఠినంగా ఉండేదని ఆయన వివరించారు. వారానికి సుమారు 80 గంటలు పనిచేసేవాళ్లమని చెప్పారు.
ఉద్యోగుల నుంచి అత్యుత్తమ ఫలితాలను రాబట్టే వాతావరణం ఉండేదని, అక్కడ పనులు కూడా వేగంగా పూర్తయ్యేవని తెలిపారు. సంప్రదాయ సంస్థల్లో ఉండే అనవసర ప్రక్రియలు, సమస్యలు తక్కువగా ఉండటంతో పనిలో వేగం పెరిగేదని చెప్పారు. ఆ కఠినమైన అనుభవమే..
తనను మరింత మెరుగైన నాయకుడిగా తీర్చిదిద్దిందని సెలింగర్ అభిప్రాయపడ్డారు. అమెజాన్‌ను విడిచిన తర్వాత ఆయన డీప్ సెంటినెల్ అనే ఏఐ బేస్డ్ హోం సెక్యూరిటీ సంస్థను స్థాపించారు. పెద్ద స్థాయి డేటా విశ్లేషణ, మెషిన్ లెర్నింగ్ వంటి అంశాలపై అమెజాన్‌లో పొందిన అనుభవం తన వ్యాపార విజయానికి
Jun 17 2026 4:45 PM | Updated on Jun 17 2026 5:07 PM
విజయవంతమైన వ్యాపారవేత్తల జీవితంలో ఎన్నో కఠినమైన అనుభవాలు, కష్టపడి పనిచేసిన రోజులు ఉంటాయి. అమెరికాకు చెందిన ఏఐ భద్రతా సంస్థ డీప్ సెంటినెల్ సీఈవో డేవిడ్ సెలింగర్ కూడా అలాంటి అనుభవాలనే గుర్తు చేసుకున్నారు. ఆయన తన కెరీర్ ప్రారంభ దశలో అమెజాన్‌లో పనిచేసిన రోజులను గుర్తు చేసుకుంటూ, సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ నాయకత్వం తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చిందని చెప్పారు.
డేవిడ్ సెలింగర్ 2002లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా అమెజాన్‌లో ఉద్యోగం పొందారు. 2003 జనవరిలో కంపెనీలో చేరి.. కస్టమర్ కస్టమర్ బిహేవియర్ రోల్ విభాగంలో పనిచేశారు. ఆ సమయంలో అమెజాన్ ఇప్పటిలా లక్షలాది ఉద్యోగులతో కూడిన దిగ్గజ సంస్థ కాదు. కొద్దిమంది ఉద్యోగులతో పనిచేస్తున్నప్పటికీ, భారీ స్థాయిలో డేటాను విశ్లేషించే అవకాశాలు అక్కడ ఉండేవని ఆయన తెలిపారు.
అమెజాన్‌లో పనిచేసే సమయంలో జెఫ్ బెజోస్‌ను వారానికి ఒకటి లేదా రెండు సార్లు కలిసేవాడినని సెలింగర్ చెప్పారు. బెజోస్ గురించి మాట్లాడుతూ.. ఆయన ఎంతో శక్తివంతమైన, లక్ష్యసాధనపై పూర్తిగా దృష్టి పెట్టే నాయకుడని పేర్కొన్నారు. “ఆయనతో పనిచేయడం అద్భుతమైన అనుభవం” అని సెలింగర్ అన్నారు.
అమెజాన్‌లోని పని సంస్కృతి కూడా అంతే కఠినంగా ఉండేదని ఆయన వివరించారు. వారానికి సుమారు 80 గంటలు పనిచేసేవాళ్లమని చెప్పారు. ఉద్యోగుల నుంచి అత్యుత్తమ ఫలితాలను రాబట్టే వాతావరణం ఉండేదని, అక్కడ పనులు కూడా వేగంగా పూర్తయ్యేవని తెలిపారు. సంప్రదాయ సంస్థల్లో ఉండే అనవసర ప్రక్రియలు, సమస్యలు తక్కువగా ఉండటంతో పనిలో వేగం పెరిగేదని చెప్పారు.
ఆ కఠినమైన అనుభవమే.. తనను మరింత మెరుగైన నాయకుడిగా తీర్చిదిద్దిందని సెలింగర్ అభిప్రాయపడ్డారు. అమెజాన్‌ను విడిచిన తర్వాత ఆయన డీప్ సెంటినెల్ అనే ఏఐ బేస్డ్ హోం సెక్యూరిటీ సంస్థను స్థాపించారు. పెద్ద స్థాయి డేటా విశ్లేషణ, మెషిన్ లెర్నింగ్ వంటి అంశాలపై అమెజాన్‌లో పొందిన అనుభవం తన వ్యాపార విజయానికి బలమైన పునాదిగా మారిందని పేర్కొన్నారు.
ముంబై : 'IWMBuzz డిజిటల్ అవార్డ్స్ సీజన్ 8'..మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు)
RRR చిన్నారి మల్లి ఇప్పుడు ఎలా మారిందో చూడండి (ఫోటోలు)
చరిత్ర సృష్టించిన లియోనల్ మెస్సీ (ఫోటోలు)
గచ్చిబౌలి స్టేడియంలో రగ్బీ సందడి..శ్రుతి హాసన్ ఆటా.. పాట (ఫోటోలు)
వడ్డే నవీన్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫోటోలు)
Viral Video: ఇలా చేస్తారా..? పసి బిడ్డ ప్రాణాలతో చెలగాటం..!
ఉతికారేసిన లక్ష్మి పార్వతి, దమ్ముంటే రా...
బిగ్ ట్విస్ట్, హైకోర్టులో సవాల్ చేసిన టెలిగ్రామ్
కాల్చేసి బూడిద చేసి, కోర్టులో వెతుకుతున్నాం అని చెప్తున్నారే