
TG 20 League : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన టీజీ20 (TG20) లీగ్ నిర్వహణకు బీసీసీఐ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేవని, ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని ‘తెలంగాణ క్రికెట్ అసోసియేషన్’ (TCA) తెలిపింది. ఈ క్రమంలోనే ఈ లీగ్‌కు ప్రచార కర్తగా ఉన్న విజయ్ దేవరకొండ, హీరో వెంకటేశ్, క్రికెటర్లు తిలక్ వర్మ, అంబటి రాయుడు, సిరాజ్‌లకు లీగల్ నోటీసులు పంపించింది.
బీసీసీఐ అనుమతి లేని టీజీ20 లీగ్‌ను ప్రమోట్ చేయడం నేరమని ఆరోపించింది. లీగ్‌కు 45 రోజులు ముందు బీసీసీఐ నుంచి అనుమతులు తీసుకోవాలని పేర్కొంది. బీసీసీఐ అనుమతి లేకుండా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ డబ్బులు వసూల్ చేసి లీగ్ నిర్వహిస్తోందని టీసీఏ ఆరోపించింది.
ఈ అక్రమ లీగ్‌ను ప్రమోట్ చేయడం, భాగస్వామ్యం వహించడం, ఎండార్స్మెంట్స్ చేయడం వంటివి చట్ట విరుద్దం అని తెలిపింది. ఈ క్రమంలోనే లీగల్ నోటీసులు ఇచ్చామని, అగ్రిమెంట్లను పునఃసమీక్షించుకోవాలని, లేని పక్షంలో వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రచారాల కింద చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొంది.
దీనిపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువా రెడ్డి మాట్లాడుతూ.. టీజీ20 అనేది ఓ మోసపూరిత లీగ్ అని ఆరోపించారు. ఈ లీగ్‌ను నిర్వహించడానికి బీసీసీఐ నుంచి హెచ్‌సీఏ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఈ లీగ్‌కు సంబంధించిన అధికారిక అనుమతి పత్రాలను మీడియా ముందు ప్రదర్శించాలని హెచ్‌సీఏకు బహిరంగ సవాల్‌ను విసిరారు.
ఇక తెలంగాణ అనే పదాన్ని ఉపయోగించే హక్కు హెచ్‌సీఏకు లేదన్నారు. తెలంగాణ క్రికెట్ వ్యవహారాలను చూసుకోవడానికి ‘తెలంగాణ క్రికెట్ అసోసియేషన్’ ఉందని తెలిపారు. ఇదిలా ఉంటే.. నిన్న హెచ్‌సీఏ మాత్రం ఈ లీగ్‌ను అధికారికంగా నిర్వహిస్తున్నామని, బీసీసీఐ అనుమతి ఉందని ప్రకటించింది.
Telangana cricket Association sent legal notice vijay devarakonda over tg20 league
TG 20 League : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన టీజీ20 (TG20) లీగ్ నిర్వహణకు బీసీసీఐ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేవని, ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని ‘తెలంగాణ క్రికెట్ అసోసియేషన్’ (TCA) తెలిపింది. ఈ క్రమంలోనే ఈ లీగ్‌కు ప్రచార కర్తగా ఉన్న విజయ్ దేవరకొండ, హీరో వెంకటేశ్, క్రికెటర్లు తిలక్ వర్మ, అంబటి రాయుడు, సిరాజ్‌లకు లీగల్ నోటీసులు పంపించింది. బీసీసీఐ అనుమతి లేని టీజీ20 లీగ్‌ను ప్రమోట్ చేయడం నేరమని ఆరోపించింది.
లీగ్‌కు 45 రోజులు ముందు బీసీసీఐ నుంచి అనుమతులు తీసుకోవాలని పేర్కొంది. బీసీసీఐ అనుమతి లేకుండా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ డబ్బులు వసూల్ చేసి లీగ్ నిర్వహిస్తోందని టీసీఏ ఆరోపించింది. ఈ అక్రమ లీగ్‌ను ప్రమోట్ చేయడం, భాగస్వామ్యం వహించడం, ఎండార్స్మెంట్స్ చేయడం వంటివి చట్ట విరుద్దం అని తెలిపింది. ఈ క్రమంలోనే లీగల్ నోటీసులు ఇచ్చామని, అగ్రిమెంట్లను పునఃసమీక్షించుకోవాలని, లేని పక్షంలో వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రచారాల కింద చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొంది.
దీనిపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువా రెడ్డి మాట్లాడుతూ.. టీజీ20 అనేది ఓ మోసపూరిత లీగ్ అని ఆరోపించారు. ఈ లీగ్‌ను నిర్వహించడానికి బీసీసీఐ నుంచి హెచ్‌సీఏ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఈ లీగ్‌కు సంబంధించిన అధికారిక అనుమతి పత్రాలను మీడియా ముందు ప్రదర్శించాలని హెచ్‌సీఏకు బహిరంగ సవాల్‌ను విసిరారు. ఇక తెలంగాణ అనే పదాన్ని ఉపయోగించే హక్కు హెచ్‌సీఏకు లేదన్నారు. తెలంగాణ క్రికెట్ వ్యవహారాలను చూసుకోవడానికి ‘తెలంగాణ క్రికెట్ అసోసియేషన్’ ఉందని తెలిపారు.
ఇదిలా ఉంటే.. నిన్న హెచ్‌సీఏ మాత్రం ఈ లీగ్‌ను అధికారికంగా నిర్వహిస్తున్నామని, బీసీసీఐ అనుమతి ఉందని ప్రకటించింది. ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు కూడా పాల్గొంటున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే.. నేడు లీగల్ నోటీసులు పంపడంతో టీజీ20 లీగ్ జరుగుతుందా? లేదా? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
షెడ్యూల్ ప్రకారం టీజీ20 లీగ్ జూన్ 21 నుంచి జూలై 12 వరకు జరగనుంది. యువ ప్రతిభను వెలికితీయడంతో పాటు తెలంగాణ క్రికెట్‌కు కొత్త ఉత్సాహం తీసుకురావాలనే లక్ష్యంతో, ప్రతిష్టాత్మకంగా ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నట్లు హెసీసీఏ పేర్కొంది. ఇప్పటికే షెడ్యూల్ ను విడుదల చేశారు.
ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు కూడా పాల్గొంటున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే.. నేడు లీగల్ నోటీసులు పంపడంతో టీజీ20 లీగ్ జరుగుతుందా? లేదా?