వరంగల్: ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ బాలుడి కోరికను నెరవేర్చారు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్.. తన అభిమాన హీరో పవన్‌కల్యాణ్‌ను కలవాలనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్ బుధవారం హనుమకొండకు విచ్చేసి బాలుడిని ఆప్యాయంగా పలకరించారు.
బాలుడితో ఫొటోలు తీసుకున్నారు. అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. పవన్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. Pawan kalyan: బాలుడి కోరిక నెరవేర్చిన పవన్ | pawan kalyan visit to hanumakonda