
నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై వైకాపా నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని సోమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు. ఆమె రేణిగుంటలో మెస్తో పాటు తట్టెల వ్యాపారం చేసిందేమో అంటూ నోరుపారేసుకున్నారు.
తాము రౌడీయిజం చేస్తే తట్టుకోలేరు అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడటం గమనార్హం. ‘మీరు ఈవీఎంలతో గెలిచారు’ అంటూ ప్రజాతీర్పును అవహేళన చేసేలా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడారు. ఈ వార్త చదివారా: వైకాపా నేతలు ఎంత దూషించినా.. ఆమె గొంతు నొక్కలేరు: లోకేశ్