
బాలకృష్ణ, విజయశాంతి ఒకప్పుడు టాలీవుడ్లో హిట్ పెయిర్. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే అది హిట్ అనేలా పరిస్థితి ఉండేది. సినిమాలు కూడా అదే స్థాయిలో విజయాలు సాధించాయి. దీంతో వీరికి మంచి క్రేజ్ ఉండేది. కానీ ఒక దశ తర్వాత ఈ ఇద్దరు సినిమాలు చేయడం మానేశారు.
దానికి కారణం `పెళ్లి` అనే టాక్ వినిపించింది. విజయశాంతి పెళ్లి చేసుకున్న తర్వాత బాలయ్యతో సినిమాలు చేయలేదని అంటుంటారు. అదే సమయంలో బాలయ్య, విజయశాంతిని పెళ్లి చేసుకోవాలనుకున్నారనే ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొట్టింది. మరి నిజంగానే..
బాలయ్య, విజయశాంతి మ్యారేజ్‌కి రెడీ అయ్యారా? అసలు అప్పుడు ఏం జరిగిందనేది ఆరా తీస్తే, అసలు నిజాలు బయటకు వచ్చాయి. ఆ టైమ్‌లో అసలు జరిగింది ఏంటో ప్రముఖ సినీ విశ్లేషణకులు చిల్లగట్టు శ్రీకాంత్ వెల్లడించారు. బాలయ్య, విజయశాంతి మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారనే దాంట్లో నిజం లేదని తెలిపారు.
అందుకు లాజిక్ కూడా వెల్లడించారు. బాలయ్య పెళ్లి 1982లో వసుంధర దేవితో జరిగింది. కానీ బాలయ్య.. విజయశాంతితో ఆ తర్వాతే కలిసి సినిమాలు చేశారు. అంటే విజయశాంతితో కలిసి నటించే నాటికి బాలయ్యకి పెళ్లి అయిపోయింది. కావున ఈ వార్తలో నిజం లేదని తెలిపారు విశ్లేషణకులు.
విజయశాంతి మ్యారేజ్ చేసుకున్న శ్రీనివాస ప్రసాద్.. బాలయ్య బంధువు అని, వారి మ్యారేజ్ సెట్ కావడానికి ఓ కారణం బాలయ్యనే అని అంటుంటారు. మరి బాలయ్య, విజయశాంతి పెళ్లి తర్వాత ఎందుకు కలిసి నటించలేదనే దానికి అసలు కారణంగా విజయశాంతి తెలిపింది.
తాను ఆ సమయంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసిందట. అవి పెద్ద హిట్ అయ్యాయి. హీరోలకు సమానంగా తన సినిమాలు ఆడుతున్నాయి. కలెక్షన్లని భారీగానే వసూలు చేస్తున్నాయి. దీంతో పారితోషికం కూడా హీరోలకు సమానంగా డిమాండ్ చేసిందట. నిర్మాతలు కూడా అంత ఇచ్చేందుకు ఓకే చెప్పారు.
, తన పాత్రకి తక్కువ ప్రయారిటీ ఇవ్వడంతో, దాన్ని విజయశాంతి ప్రశ్నించిందని, అలా ఉన్న సినిమాలు రిజెక్ట్ చేసిందని, ఇలా బాలయ్యతో సినిమాలు చేయలేకపోయినట్టు తెలిపింది. చిరంజీవితోనూ ఈ కారణంగానే ఆ తర్వాత కలిసి నటించలేకపోయినట్టు తెలిపింది. అదే గానీ మరో కారణం కాదని ఆమె ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇదిలా ఉంటే బాలయ్యకి 1982లో పెళ్లి అయితే, విజయశాంతి 1988లో శ్రీనివాస ప్రసాద్‌ని వివాహం చేసుకుంది.
అయితే పాత్ర పరంగా ప్రయారిటీ విషయంలో తేడాలు వచ్చేవని, హీరోలకు ఎక్కువగా