
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లకు సంబంధించి మాతృసంస్థ 'మెటా ప్లాట్‌ఫామ్స్' ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉచితంగా అందిస్తున్న ఈ యాప్‌లలో అదనపు ఫీచర్ల కోసం ఐచ్ఛిక పెయిడ్ సబ్స్క్రిప్షన్లను అందుబాటులోకి తెచ్చింది.
'ప్లస్' పేరుతో వస్తున్న ఈ కొత్త సేవలు మే నెలాఖరు నుంచి ప్రపంచవ్యాప్తంగా దశలవారీగా అమల్లోకి వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో వేల కోట్ల డాలర్లు పెట్టుబడిగా పెడుతున్న తరుణంలో, కేవలం ప్రకటనల ఆదాయంపైనే ఆధారపడకుండా కొత్త ఆదాయ మార్గాలను సృష్టించుకోవడమే లక్ష్యంగా మెటా ఈ అడుగు వేసింది.భారత్‌లో రూ.99కే ప్రీమియం ప్లాన్లుఈ కొత్త ప్లాన్ల ప్రకారం, 'ఇన్స్టాగ్రామ్ ప్లస్', 'ఫేస్బుక్ ప్లస్' కోసం నెలకు సుమారు 3.99 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
భారత్‌లో దీని ధరను ప్రారంభ ఆఫర్లతో కలిపి సుమారు రూ.99గా నిర్ణయించారు. అదేవిధంగా 'వాట్సాప్ ప్లస్' సబ్స్క్రిప్షన్ కోసం నెలకు 2.99 డాలర్లు (భారత్‌లో సుమారు రూ.99) చెల్లించాలి. ఈ ప్లాన్లు తీసుకున్న యూజర్లకు స్టోరీల నిడివి పెంచుకోవడం, ప్రొఫైల్ కస్టమైజేషన్, సూపర్ రియాక్షన్లు, సీక్రెట్ స్టోరీ వ్యూయింగ్, మరిన్ని చాట్లను పిన్ చేసుకునే సౌలభ్యం వంటి పలు ప్రీమియం ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి.
అయితే, ప్రస్తుతం ఉన్న ప్రాథమిక సేవలు యథాతథంగా అందరికీ ఉచితంగానే కొనసాగుతాయని, వాటిలో ఎలాంటి మార్పు ఉండదని మెటా స్పష్టం చేసింది.ఏఐ పెట్టుబడుల కోసమే ఈ వ్యూహంమెటా ఈ ఏడాది తన మూలధన వ్యయాన్ని ఏకంగా 125 బిలియన్ డాలర్ల నుంచి 145 బిలియన్ డాలర్లకు