
భారత్‌లో జనాభా రోజురోజుకు పెరుగుతోంది. అందుకు తగ్గట్లుగా సాధారణ రైలు బోగీలను భారతీయ రైల్వే పెంచడం లేదు. దీంతో రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యక్ష నరకం ఏదైనా ఉందంటే జనరల్ బోగీలో ప్రయాణమే.
దేశంలో జనాభా రోజురోజుకు పెరుగుతోంది. దీనికి తగినట్లు ప్యాసింజర్ రైళ్లలోనే కాదు.. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కూడా సాధారణ బోగీల (జనరల్ కంపార్ట్మెంట్లు) సంఖ్యను భారతీయ రైల్వే పెంచడం లేదు. దీంతో మామూలు టికెట్ కొనుగోలు చేసిన సాధారణ ప్రయాణికుడు..
రిజర్వేషన్ కంపార్ట్మెంట్లోకి మహారాజులాగే ఎక్కేస్తున్నాడు. ఆ రైలు బోగీలోని బాత్రూమ్ని ఆక్రమిస్తున్నాడు. ఇలా చాలా మంది రిజర్వేషన్ బోగీలోకి ఎక్కేస్తున్నారు. దీంతో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు.
బాత్రూమ్కు వెళ్లాలనుకునే ప్రయాణికుల బాధలు వర్ణణాతీతం. తాజాగా అలాంటి సంఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. రిజర్వేషన్ బోగీలో బాత్ రూమ్‌తోపాటు ఆ ప్రదేశం సాధారణ టికెట్‌తో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులతో నిండిపోయింది. దీంతో బాత్ రూమ్‌కి వెళ్లేందుకు రిజర్వేషన్ చేయిచుకున్న ఒక వ్యక్తి ప్రయత్నించాడు.
అక్కడ కూర్చున్న వారిని పక్కకు జరగాలని కోరాడు. అందుకు వారు ససేమీరా అన్నారు. అలాగే బాత్ రూమ్ తలుపు తోశాడు. అందులో ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు. వారిని బయటకు రమ్మంటే రాలేదు. అంతేకాకుండా.. వారి నుంచి సదరు ప్రయాణికుడికి బెదిరింపులు ఎదురయ్యాయి.
దీంతో కనీసం బాత్ రూమ్‌కు కూడా వెళ్లకుండా ఉండడం ఏమిటీ? ఇలా అయితే ఎలా అంటూ అతడు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అందుకు సంబంధించిన వీడియోను ఆ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆర్పీఎఫ్ను కానీ టీటీఈ కానీ పంపించాలంటూ ఆ వీడియోలో రైల్వే అధికారులను కోరాడు.
ఈ వీడియోను రైల్వే శాఖకు ట్యాగ్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు మండిపడ్డారు. ఈ తరహా ఘటనలు తమకు కూడా ఎదురయ్యాయని గుర్తు
చేసుకుని కామెంట్ చేశారు. ఈ వీడియోపై రైల్వే శాఖ స్పందించింది. సదరు ప్రయాణికుడిని రైలు నంబర్, పీఎన్ఆర్ నెంబర్‌తోపాటు మొబైల్ నెంబర్ ఇవ్వాలని కోరింది. ఈ వీడియోను ఆర్పీఎఫ్ అధికారులకు పంపినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. రిజర్వేషన్ బోగీల్లోకి సాధారణ టికెట్‌తో ప్రయాణించే వారిని అనుమతించవద్దని అధికారులకు రైల్వే శాఖ స్పష్టం చేసింది.
చీలిక దిశగా సమాజ్‌వాదీ పార్టీ.. బాంబు పేల్చిన యూపీ మంత్రి
బెంగాల్ బ్లాక్‌బస్టర్ షో.. అన్సంగ్ హీరో మిథున్ చక్రవర్తి