
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఇవాళ భారత్, అఫ్గానిస్థాన్ 'ఎ' జట్లు తలపడుతున్నాయి. ఫైనల్‌కు చేరాలంటే కీలకమైన ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఇవాళ(బుధవారం) భారత్, అఫ్గానిస్థాన్ 'ఎ' జట్లు తలపడుతున్నాయి. ఫైనల్‌కు చేరాలంటే కీలకమైన ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దూకుడుగా ఆడారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది.
ముగ్గురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో రాణించడంతో అఫ్గాన్ జట్టు ముందు 320 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ తిలక్ వర్మ (59), ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (58), కుమార్ కుషాగ్రా (58) అర్ధ శతకాలతో రాణించారు.
మిగతా బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ (38), రుతురాజ్ గైక్వాడ్ (30) ఫర్వాలేదనిపించారు. ఆరంభంలో వైభవ్ డకౌట్ అయ్యే ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డాడు. అతడు ఇచ్చిన క్యాచ్‌ను అఫ్గాన్ ఫీల్డర్ పట్టినా.. బంతి నేలకు తాకినట్లు రీప్లేలో తేలింది.
సూర్యాంశ్ షెడ్జే (7) స్వల్ప పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. ఆఖర్లో విప్రాజ్ నిగమ్ (30), నిషాంత్ సింధు (21*) కాస్తా బ్యాట్ ఝుళిపించారు. ఇక అఫ్గాన్ బౌలర్లలో ఫరిదూన్ , అబ్దుల్లా , ఫర్మనుల్లా తలో రెండు వికెట్లు సాధించారు. జహీర్‌ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు.
కన్నీరు పెట్టుకున్న అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ విరాట్ కోహ్లీ.. భారత అత్యుత్తమ ఫీల్డర్ కాదు: జాంటీ రోడ్స్