
మంగళగిరి మండలం కాజ గ్రామంలోని ఉప్పలపాడు-నంబూరు-కాజ రోడ్డు మార్గంలో ఆధునిక హంగులతో నిర్మించిన కాజ ఈస్ట్ లేక్ పార్క్ ను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ముందుగా కాజ లేక్ పార్క్ కు చేరుకున్న మంత్రి లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్ లకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు.
అనంతరం రిబ్బన్ కట్ చేసి కాజ ఈస్ట్ లేక్ పార్క్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. పార్క్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కను నాటారు. అనంతరం పార్క్ మొత్తం కలియతిరిగి వసతులను పరిశీలించారు.
సెల్ఫీలు తీసుకున్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మరింత మెరుగైన పర్యావరణం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించాలనే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా కాజ గ్రామంలో ఈస్ట్ లేక్ పార్క్ ను నిర్మించారు. సెల్ కాన్ సంస్థ రూ.3.3 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఈ పార్క్‌ను అభివృద్ధి చేసింది.
17.18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు చుట్టూ ఆధునిక హంగులతో పార్క్‌ను తీర్చిదిద్దారు. ఇప్పటికే ఉన్న చెరువు కట్టను 1.7 కిలోమీటర్ల మేర బలోపేతం చేశారు. పార్క్‌లో 42 రకాల జాతులకు చెందిన 12 వేల,800 మొక్కలు నాటారు. 1.7 కిలోమీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పుతో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు.
అదేవిధంగా ఓపెన్ జిమ్, చిన్నారుల కోసం ప్రత్యేక ప్లే ఏరియా, భద్రత కోసం ట్రాక్ కు ఇరువైపులా జీఐ చైన్- లింక్ మెష్ ఫెన్సింగ్, ఆధునిక సుందరీకరణ పనులు చేపట్టి పార్క్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మంగళగిరిలో అండర్ డ్రైజేజీ పనులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
.