
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) జాతీయ అధికార ప్రతినిధి ఆకాశ్ కొల్లూరు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ ప్రవర్తన, ఆయన రాజకీయ వైఖరిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ..
ఆయనకు అసలు రాజకీయ, మానసిక స్థిరత్వం లేదంటూ మండిపడ్డారు. తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తూ, ఇక్కడి సెంటిమెంట్ను తీవ్రవాదంతో పోల్చితే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని, వచ్చే ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెబుతారని ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు.జాతీయ మీడియా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చి, టి.ఆర్.ఎస్ (TRS) జాతీయ ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన ఆకాశ్ కొల్లూరు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయితెలంగాణ సెంటిమెంట్పై దాడి..
సహించేది లేదుతెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనేది ఊరికే రాలేదని, సుమారు 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, 1200 మంది అమరవీరుల రక్తతర్పణం వల్ల సాకారమైన సత్యమని ఆకాశ్ కొల్లూరు గుర్తు చేశారు. ఒకవైపు అమరవీరులకు నివాళులు అర్పిస్తానని చెబుతూనే, మరోవైపు జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం నాడే ఇక్కడి ప్రాంతీయ సెంటిమెంట్ను తీవ్రవాదం, అసాంఘిక శక్తులు, దేశ వ్యతిరేకతతో పవన్ కళ్యాణ్ పోల్చడం అత్యంత దుర్మార్గమన్నారు.
ఇలాంటి కపట బుద్ధిని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించరని, గతంలోనే పవన్ను తిరస్కరించిన ఇక్కడి ఓటర్లు, వచ్చే ఎన్నికల్లో ఆయనకు మరోసారి శాశ్వతంగా తలుపులు మూసేయడం ఖాయమని హెచ్చరించారు.దేశంలోనే అత్యంత అస్థిరమైన నాయకుడుభారతదేశ రాజకీయ చరిత్రలోనే పవన్ కళ్యాణ్ అంతటి పరస్పర విరుద్ధమైన, అస్థిరమైన నాయకుడిని ఎవరూ చూసి ఉండరని ఆకాశ్ ఎద్దేవా చేశారు. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయని పేర్కొంటూ..
2007లోనే నరేంద్ర మోదీ దేశ ప్రధాని అవుతారని తనకు తెలుసని పవన్ చెబుతుంటారని, మరి అదే నిజమైతే సొంత పార్టీ పెట్టడం, ఆపై టీడీపీతో, ఆ తర్వాత వామపక్షాలతో పొత్తులు పెట్టుకుని, చివరకు మళ్లీ బీజేపీ
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) జాతీయ అధికార ప్రతినిధి ఆకాశ్ కొల్లూరు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ ప్రవర్తన, ఆయన రాజకీయ వైఖరిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. ఆయనకు అసలు రాజకీయ, మానసిక స్థిరత్వం లేదంటూ మండిపడ్డారు. తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తూ, ఇక్కడి సెంటిమెంట్‌ను తీవ్రవాదంతో పోల్చితే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని, వచ్చే ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెబుతారని ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు.జాతీయ మీడియా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చి, టి.ఆర్.ఎస్ (TRS) జాతీయ ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన ఆకాశ్ కొల్లూరు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయితెలంగాణ సెంటిమెంట్‌పై దాడి.. సహించేది లేదుతెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనేది ఊరికే రాలేదని, సుమారు 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, 1200 మంది అమరవీరుల రక్తతర్పణం వల్ల సాకారమైన సత్యమని ఆకాశ్ కొల్లూరు గుర్తు చేశారు. ఒకవైపు అమరవీరులకు నివాళులు అర్పిస్తానని చెబుతూనే, మరోవైపు జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం నాడే ఇక్కడి ప్రాంతీయ సెంటిమెంట్‌ను తీవ్రవాదం, అసాంఘిక శక్తులు, దేశ వ్యతిరేకతతో పవన్ కళ్యాణ్ పోల్చడం అత్యంత దుర్మార్గమన్నారు. ఇలాంటి కపట బుద్ధిని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించరని, గతంలోనే పవన్‌ను తిరస్కరించిన ఇక్కడి ఓటర్లు, వచ్చే ఎన్నికల్లో ఆయనకు మరోసారి శాశ్వతంగా తలుపులు మూసేయడం ఖాయమని హెచ్చరించారు.దేశంలోనే అత్యంత అస్థిరమైన నాయకుడుభారతదేశ రాజకీయ చరిత్రలోనే పవన్ కళ్యాణ్ అంతటి పరస్పర విరుద్ధమైన, అస్థిరమైన నాయకుడిని ఎవరూ చూసి ఉండరని ఆకాశ్ ఎద్దేవా చేశారు. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయని పేర్కొంటూ.. 2007లోనే నరేంద్ర మోదీ దేశ ప్రధాని అవుతారని తనకు తెలుసని పవన్ చెబుతుంటారని, మరి అదే నిజమైతే సొంత పార్టీ పెట్టడం, ఆపై టీడీపీతో, ఆ తర్వాత వామపక్షాలతో పొత్తులు పెట్టుకుని, చివరకు మళ్లీ బీజేపీ ఒడిలో చేరడం ఎందుకని ప్రశ్నించారు. నిజంగానే అంత ముందుచూపు ఉంటే మొదటి రోజే బీజేపీలో చేరాల్సి ఉండేదన్నారు. అలాగే తనను హైదరాబాద్ రానివ్వడం లేదని అబద్ధాలు చెప్తూనే, వారంలో మూడు రోజులు ఇక్కడే జల్సాగా గడుపుతుండటం పవన్ కళ్యాణ్ ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతోందని విమర్శించారు.సిద్ధాంతాల మార్పిడి.. రాజకీయాల్లో ఒక జోక్పవన్ కళ్యాణ్ పవిత్రమైన రాజకీయ రంగాన్ని ఒక పెద్ద జోక్‌గా మార్చేశారని ఆకాశ్ కొల్లూరు మండిపడ్డారు. అత్యంత బాధ్యతాయుతమైన పబ్లిక్ లైఫ్‌లో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఊసరవెల్లిలా మారుతున్నాయని విమర్శించారు. 2019లో తీవ్ర వామపక్ష భావజాలంతో ఎర్రజెండా పట్టిన పవన్, 2024 వచ్చేసరికి తీవ్ర కుడిపక్ష రైట్ వింగ్ భావజాలానికి మారిపోయారని దుయ్యబట్టారు. తెలంగాణను పునర్నిర్మిస్తానని ప్రగల్భాలు పలుకుతూనే, ఇక్కడి ప్రాంతీయ ఉద్యమ అస్తిత్వాన్ని ఉగ్రవాదం కంటే ఘోరమైనదిగా చిత్రీకరించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు.మానసిక పరీక్షలు అవసరం.. ఏపీ ప్రజల కోసమైనా!తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు పవన్ కళ్యాణ్ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన ప్రవర్తన అత్యంత దూకుడుగా, అసాధారణంగా ఉందని ఆకాశ్ అభిప్రాయపడ్డారు. ఆ రోజు ఆయన చూపించిన ఆవేశం వెనుక రెండు కారణాలు ఉండవచ్చని.. ఒకటి ఆ స్క్రిప్ట్ ముందే రాసి ఉండాలి, లేదా ఆయనలో తీవ్రమైన మానసిక అస్థిరత అయినా ఉండి ఉండాలని వ్యాఖ్యానించారు. తాను డాక్టర్‌ను కానందున దీనిపై ఖచ్చితమైన వైద్యపరమైన తీర్పు ఇవ్వలేనని, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ ఒకసారి మానసిక పరీక్షలు చేయించుకుంటే మంచిదని సంచలన సూచన చేశారు. కీలకమైన ప్రభుత్వ పోర్ట్‌ఫోలియోలను నిర్వహిస్తున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి మానసిక స్థితి సరిగ్గా ఉందో లేదో తెలుసుకునే హక్కు అక్కడి ప్రజలకు ఉందని ఆకాశ్ కొల్లూరు ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.