
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Rulers became killers Mamata Banerjee fire on west Bengal bjp govt: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. సౌత్ 24 పరగణాల జిల్లా సోనార్‌పూర్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ ఎంపీ అభిషేక్ బెనర్జీపై స్థానికులు దాడులకు పాల్పడ్డారు. ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లలో గాయపడ్డ టీఎంసీ కార్యకర్తల్ని పరామర్శించేందుకు అభిషేక్ వెళ్లారు. దీంతో స్థానికులు కొంత మంది అభిషేక్ ను అడ్డుకున్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రాళ్లు,గుడ్లతో దాడులు చేశారు. అప్పటికే అభిషేక్ బెనర్జీ హెల్మెట్ పెట్టుకొని ఉండటం వల్ల పెద్ద ప్రమాదం నుంచి బైటపడ్డారు. తలకు గాయాలుకాకుండా మాత్రంతప్పించుకున్నారు. అల్లరిమూకలు ఆయన చొక్కాను చింపేసి, పిడిగుద్దులు కురిపించారు. దీంతో అతికష్టం మీద అభిషేక్ ను పోలీసులు, టీఎంసీ కార్యకర్తలు అక్కడి నుంచి అభిషేక్ బెనర్జీని బైటకు తీసుకొని వచ్చారు. వెంటనే ఆయనను స్థానికంగా ఉన్న అపోలో ఆస్పత్రికి తరలించారు. పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్ద టీఎంసీ, బీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గకుండా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడ్డ తన మేనల్లుడ్ని చూసేందుకు ఆస్పత్రికి మమతా బెనర్జీ పరుగులు పెట్టారు. మేనల్లుడ్ని ఆస్థితిలో చూసి మమతా ఎమోషనల్ అయ్యారు. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వంపై మండిపడ్డ మమతా బెనర్జీ.. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై
జరిగిన దాడిపై మమతా ఫైర్ అయ్యారు. ఈ ఘటనకు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీఎంసీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాలకులు హంతకులుగా మారారని.. బీజేపీ సిగ్గుపడాలంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను కూడా ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.
ఎన్నికల హింసలో ప్రాణాలు కోల్పోయిన సంజూ కర్మాకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన అభిషేక్‌పై బీజేపీ మద్దతు ఉన్న దుండగులు దాడికి పాల్పడ్డారని టీఎంసీ ఆరోపించింది. బీజేపీపై పొరాటం చేయడంలో వెనక్కు తగ్గమన్నారు. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు.
ఈ దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు అభిషేక్ బెనర్జీపై దాడిని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నేతకు భద్రత కల్పించాల్సిన పోలీసులు ఏంచేస్తున్నారని మండిపడ్డారు.ఇది ప్రతీకార రాజకీయాలుకాక పోతే ఇంకేమన్నారు.
ఇలాంటి దాడులు అపోషిషన్ పార్టీల నోరును మూయలేవన్నారు. యూపీ సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ కూడా ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. టీఎంసీ కీలక నేతపై జరిగిన దాడి బీజేపీ విద్వేష పూరిత పాలనకు అద్దం పడుతుందని విమర్శలు గుప్పించారు.
మేనల్లుడి కోసం ఆస్పత్రికి పరుగులు పెట్టిన మమతాపై బీజేపీ శ్రేణులు మండిపడ్డారు. గతంలో ఆర్.జి. కర్ బాధితురాలికి న్యాయం జరిగేలా చూడటానికి ఎప్పుడైనా ఇంత ఆత్రుత చూపారా?.. లేదా సందేశ్‌ఖాలి ఘటనలో మహిళల పట్ల ఆమె ఇంత సున్నితత్వం చూపారా? అని ఫైర్ అవుతున్నారు.
Read more: West Bengal: వెస్ట్ బెంగాల్ లో మరోసారి హైటెన్షన్..మమతా బెనర్జీ మేనల్లుడిపై రాళ్లు, గుడ్లతో దాడి.. వీడియో వైరల్..
అంతే కాకుండా.. 300 మందికి పైగా బీజేపీ కార్యకర్తల రాజకీయ హత్యల విషయంలోఎప్పుడైన ఈ విధంగా స్పందించారా..?.. 20 ఏళ్ల త్రిలోచన్ మహతో హత్యకు గురై, అతని మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసినప్పుడు మమతా బెనర్జీకి కనీసం స్పందించలేదని తీవ్ర స్థాయిలో బీజేపీ నేతలు మండి పడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook