
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Bank FD vs Post Office FD: భారతదేశంలో డబ్బులు పొదుపు చేసుకోవాలంటే అందరికీ గుర్తుకొచ్చే మొదటి పేరు పోస్ట్ ఆఫీస్. ఎందుకంటే దేశంలో ప్రతి మారుమూల పల్లెటూర్లో కూడా పోస్ట్ ఆఫీస్ అనేది ఉంటుంది. కోట్లాది మంది భారతీయులకు తొలి బ్యాంకు పోస్ట్ ఆఫీస్ అని చెప్పవచ్చు.
స్టాక్ మార్కెట్ సహా అనేక పెట్టుబడి సాధనాలు మార్కెట్లో ఎన్ని లభ్యమవుతున్నా గాని పోస్ట్ ఆఫీస్ లోనే డబ్బులు దాచుకునేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. దీనికి ప్రధాన కారణం పోస్ట్ ఆఫీస్ అనేది భారత ప్రభుత్వ విభాగం. పోస్ట్ ఆఫీస్ లో దాచుకున్న డబ్బు పైన భారత ప్రభుత్వం హామీ ఇస్తుంది.
అందుకే పోస్ట్ ఆఫీస్ లోనే డబ్బు దాచుకునేందుకు జనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే అటు ప్రభుత్వ బ్యాంకులు సైతం ఫిక్స్ డిపాజిట్ల పైన చక్కటి వడ్డీరేట్లను అందిస్తుంటాయి. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రస్తుతం ఫిక్స్ డిపాజిట్ పైన చక్కటి వడ్డీరేట్లు అందిస్తున్నాయి.
ఆర్బిఐ రెపో రేట్లు ఒకవేళ పెంచినట్లయితే, కూడా బ్యాంకుల ఫిక్స్ డిపాజిట్ల పైన కూడా వడ్డీ రేట్లు పెరుగుతాయి. పోస్ట్ ఆఫీస్ FD (నేషనల్ సేవింగ్ టైమ్ డిపాజిట్): ఇది కేంద్ర ప్రభుత్వ హామీతో నడుస్తుంది కాబట్టి చాలా సురక్షితం. వడ్డీ రేట్లు కాలానుగుణంగా మారుతుంటాయి ప్రస్తుతం 1 నుండి 5 ఏళ్ల కాలపరిమితికి 6.9% నుండి 7.5% వరకు అందిస్తున్నాయి.
టాక్స్ బెనిఫిట్ విషయానికి వస్తే 5 ఏళ్ల FD పై
సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లు సాధారణంగా బ్యాంకుల కంటే కొంచెం ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.
ప్రభుత్వ బ్యాంక్ ఫిక్స్ డిపాజిట్లు కూడా చాల సురక్షితమే,ఎందుకంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) ప్రకారం, ఒక బ్యాంకులో మీ డిపాజిట్ పైన 5 లక్షల రూపాయల వరకు భీమా ఉంటుంది. అయితే మీరు పెద్ద మొత్తంలో డబ్బును ఒకే బ్యాంకులో కాకుండా, వేర్వేరు బ్యాంకుల్లో ఫిక్స్ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. బ్యాంక్ ఫిక్స్ డిపాజిట్లలో ఉండే ప్రధాన ప్లస్ పాయింట్ ఫ్లెక్సిబిలిటీ. మీరు కేవలం 7 రోజుల నుండి 10 ఏళ్ల వరకు మీకు నచ్చిన కాలపరిమితిని ఎంచుకోవచ్చు.
అలాగే, ఎమర్జెన్సీ సమయంలో డబ్బు అవసరమైతే ఫిక్స్ డిపాజిట్ విత్ డ్రా చేయకుండానే దానిపై లోన్ తీసుకునే సదుపాయం ఉంటుంది. సీనియర్ సిటిజన్స్‌కు అదనపు వడ్డీ ప్రయోజనాలు కూడా బ్యాంకుల్లో ఎక్కువగా లభిస్తాయి. , బ్యాంక్ ఫిక్స్ డిపాజిట్లలో వడ్డీ ఆదాయం నిర్దిష్ట పరిమితి దాటితే TDS కట్ అవుతుంది, కానీ పోస్ట్ ఆఫీస్ ఫిక్స్ డిపాజిట్లలో TDS కట్ అవదు. కానీ అత్యవసర పరిస్థితులలో బ్యాంకు నుంచి ఫిక్స్ డిపాజిట్ వెంటనే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్ డిపాజిట్ విత్‌డ్రా చేసుకోవాలి అంటే ఎక్కువ సమయం పడుతుంది.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.