తెలుగు ఓటీటీ రంగంలో సరికొత్త నవ్వుల రికార్డులు సృష్టించిన మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ ఫ్రాంచైజీ ‘సేవ్ ది టైగర్స్’. మొదటి రెండు సీజన్ల భారీ విజయం తర్వాత, అంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న “సేవ్ ది టైగర్స్ సీజన్ 3” విడుదలకు సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని AMB సినిమాస్‌లో ఏర్పాటు చేసిన ఈ సిరీస్ స్పెషల్ సెలబ్రిటీ ప్రీమియర్ షో అంగరంగ వైభవంగా జరిగింది. టాలీవుడ్ ప్రముఖులు, వెండితెర, బుల్లితెర తారల తళుకులతో రెడ్ కార్పెట్ వేడుక ఎంతో ఆహ్లాదంగా, సందడిగా సాగింది.
రెడ్ కార్పెట్‌పై మెరిసిన తారలుఈ ప్రత్యేక ప్రీమియర్ షోకు చిత్ర పరిశ్రమ నుండి భారీగా సెలబ్రిటీలు తరలివచ్చారు. టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, కామాక్షి భాస్కర్ల, రాగ్ మయూర్, బిగ్ బాస్ విజేతలు వీజే సన్నీ, కళ్యాణ్ పడాలతో పాటు చైతన్య రావు, వెంకటేష్ కాకుమాను, కార్తిక్ రత్నం, కిరీటి దామరాజు, నిరుపమ్, మానస్, జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్, డైరెక్టర్ ఆదిత్య మండల, శ్రీనాథ్ మాగంటి తదితరులు హాజరై సందడి చేశారు.
హై-ఫ్యాషన్ దుస్తుల్లో మెరిసిన తారల హాజరు, మీడియా ఇంటరాక్షన్లు, ప్రీ-స్క్రీనింగ్ గెట్-టుగెదర్స్ ఈ వేడుకను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. సిరీస్ చూసిన సెలబ్రిటీలంతా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా ఉందంటూ మూడో సీజన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.* మా ఇంటి బంగారం Vs ఏ మాయ చేశావే..
‘బేరాల్లేవమ్మా’ ఆ సినిమా లేకపోతే నేనే లేను: సమంత అదిరిపోయిన రెస్పాన్స్మూడు విభిన్న జంటల కథతో, భార్యాబాధితులైన భర్తల కామెడీ టైమింగ్‌తో సాగే ఈ సిరీస్‌లో ప్రియదర్శి , అభినవ్ గోమటం, కృష్ణ చైతన్య తమ నటనతో మరోసారి ఇరగాదీశారు. వారికి జోడీగా నటించిన జోర్దార్ సుజాత, దేవియాని శర్మ, పావని గంగిరెడ్డిల పెర్ఫామెన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.
వెన్నెల కిషోర్, అలాగే రోహిణి తమ మార్క్ కామెడీతో సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ప్రీమియర్ చూసిన ప్రేక్షకుల నుండి ఈ సరికొత్త సీజన్‌కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. * ఈ వారం ఓటీటీలో వినోదాల జాతర.. దృశ్యం 3, సేవ్ ది టైగర్స్ 3 సహా క్రేజీ అప్డేట్స్ జూన్ 19 నుండి జియో హాట్స్టార్లోతెలుగు వెబ్ సిరీస్ చరిత్రలోనే అత్యధిక వ్యూయర్షిప్ సాధించిన సిరీస్‌గా ‘సేవ్ ది టైగర్స్’ సరికొత్త రికార్డు సృష్టించింది. మొదటి రెండు సీజన్లలోని క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, నవ్వులు పూయించే పాత్రలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూడో సీజన్ మరింత ఉత్కంఠభరితమైన ఫ్యాంటసీ ట్విస్ట్‌లతో ఆడియన్స్‌ను అలరించడానికి సిద్ధమైంది. మేకర్స్ ముందే హింట్ ఇచ్చినట్లుగా.. పరిస్థితులను తలకిందులు చేస్తూ, సరికొత్త గర్జనతో టైగర్స్ మళ్లీ వచ్చేస్తున్నారు. ఈ క్రేజీ ఫ్యామిలీ వెబ్ సిరీస్ జూన్ 19 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్‌స్టార్'లో గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కానుంది.
ముఖ్యంగా ఈ సీజన్లో ప్రత్యేక పాత్రలో మెరిసిన స్టార్ కమెడియన్