తెలుగు టెలివిజన్ రంగంలో తనదైన వాక్చాతుర్యం, తిరుగులేని ఎనర్జీతో బుల్లితెర రాములమ్మగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ యాంకర్ శ్రీముఖి ప్రస్థానం అప్రతిహాసంగా దూసుకుపోతోంది. ఒకవైపు అగ్ర శ్రేణి టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూనే, మరోవైపు వెండితెరపై నటిగా వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్లో అత్యధిక పారితోషికం అందుకునే యాంకర్లలో ఒకరిగా దూసుకుపోతున్న శ్రీముఖి.. ఇటీవల కాలంలో ఎక్కడ కనిపించినా ఆమెకు ఎదురవుతున్న ఏకైక ప్రశ్న 'పెళ్లి ఎప్పుడు?'. 33 ఏళ్ల ఈ గ్లామరస్ యాంకర్ వైవాహిక జీవితంలోకి ఎప్పుడు అడుగుపెడుతుందా అని అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఒక సినిమా వేడుకలో శ్రీముఖి తన పెళ్లిపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు నెట్టింట విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి.* మా ఇంటి బంగారం Vs ఏ మాయ చేశావే.. ‘బేరాల్లేవమ్మా’ ఆ సినిమా లేకపోతే నేనే లేను: సమంతసమంత ప్రధాన పాత్రలో, ప్రముఖ మహిళా దర్శకురాలు బి.వి.
నందినీ రెడ్డి తెరకెక్కించిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ మా ఇంటి బంగారం ’. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో శ్రీముఖి ఒక వినూత్నమైన, కథను మలుపు తిప్పే కీలక పాత్రను పోషించారు. జూన్ 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న సందర్భంగా చిత్రబృందం భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది.
ఈ వేడుకకు హాజరైన శ్రీముఖి వేదికపై మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా, పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. స్టేజ్‌పై శ్రీముఖి తనదైన శైలిలో నవ్వులు పూయిస్తూ సరదాగా వ్యాఖ్యానించారు. "ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన సమయంలో ప్రధాన పాత్రధారి సమంతకు పెళ్లి జరిగింది.
ఇప్పుడు ఎన్నో విశేషాలు దాటుకుని ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా థియేటర్లలో అద్భుతమైన విజయాన్ని అందుకుని, పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అయిన తర్వాత నా పెళ్లి కూడా జరగాలని నేను బలంగా కోరుకుంటున్నాను" అని మనసులోని మాటను
బయటపెట్టారు. అంతటితో ఆగకుండా, "నేను ఇప్పటికీ నా జీవిత భాగస్వామి కోసం, ఒక మంచి పెళ్లికొడుకు కోసం ఎదురుచూస్తున్నాను. సరైన వ్యక్తి దొరికిన వెంటనే తప్పకుండా వివాహం చేసుకుంటాను. నిజానికి పెళ్లి చేసుకోవాలనే ఉత్సాహం నాలో కూడా చాలా ఎక్కువగా ఉంది. మండపం రెడీ, క్యాటరింగ్ రెడీ.. వరుడి కోసం వెయింటింగ్" అంటూ నవ్వుతూ ముగించారు. ఆమె చేసిన ఈ బోల్డ్ అండ్ ఫన్నీ కామెంట్స్‌కు అక్కడున్న సెలబ్రిటీలతో పాటు ఆడియన్స్ అందరూ చప్పట్లతో సపోర్ట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "ఇప్పుడైనా గుడ్ న్యూస్ చెప్పారు.. మేము కూడా మీ పెళ్లి వేడుక చూడటానికి వెయిట్ చేస్తున్నాం" అంటూ సరదాగా పోస్టులు పెడుతున్నారు.* ‘కల్కి 2’ సెన్సేషనల్ లీక్... సైలెంట్‌గా షూటింగ్ పూర్తి చేసిన ఆలియా భట్?బుల్లితెరపై ‘అదుర్స్’ అనే రియాలిటీ షో ద్వారా శ్రీముఖి యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ప్రముఖ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2012లో వచ్చిన ‘జులాయి’ సినిమాలో అల్లు అర్జున్‌కు సోదరి పాత్రలో నటించి వెండితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 2013లో వచ్చిన ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాతో హీరోయిన్గా మారి మెప్పించారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, నేను శైలజ, జెంటిల్మెన్, బాబు బాగా బిజీ, క్రేజీ అంకుల్స్, భోళా శంకర్.. వంటి భారీ చిత్రాలలో ముఖ్యమైన పాత్రలు పోషించి నటిగా తన ముద్ర వేశారు. బుల్లితెరపై ‘పటాస్’ షోతో శ్రీముఖి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ పాపులారిటీతోనే ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 3’లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి, గట్టి పోటీ ఇచ్చి ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు. ప్రస్తుతం అనేక రియాలిటీ షోలు, అవార్డు ఫంక్షన్లు, ప్రత్యేక ఈవెంట్లతో తీరిక లేకుండా గడుపుతున్న శ్రీముఖి.. జూన్ 19న రాబోతున్న ‘మా ఇంటి బంగారం’ సినిమాతో నటిగా మరో పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. ఈ చిత్రం ఆమెకు ఎలాంటి గుర్తింపు తెస్తుందో, ఆమె ఆశించినట్లుగా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతుందో లేదో చూడాలి.