
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ (Nag Aswin) కాంబినేషన్లో వచ్చిన కల్కి 2898 ఏడి ( Kalki 2898 AD)బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాల కలయిక ఈ చిత్ర విజయానికి ప్రధాన బలంగా నిలిచింది.
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్లో వచ్చిన కల్కి 2898 ఏడి ( Kalki 2898 AD)బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాల కలయిక ఈ చిత్ర విజయానికి ప్రధాన బలంగా నిలిచింది.
ఇప్పుడు ఈ చిత్ర సీక్వెల్ కల్కి 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే రెండు కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కాస్టింగ్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ నుంచి బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనె తప్పుకున్న విషయం కూడా అందరికి తెల్సిందే.
ఇక కల్కి 2 కోసం నాగ్ అశ్విన్ మరో హీరోయిన్ ని వెతుకుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆలియా భట్ ఈ సినిమాలో ఒక అత్యంత ప్రాధాన్యత కలిగిన పాత్రలో కనిపించబోతుందని, ఇప్పటికే ఆమె కొంతమేర షూటింగ్‌ను కూడా రహస్యంగా పూర్తి చేసిందని టాక్ నడుస్తోంది.
ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆలియా భట్ ఆ తరువాత తెలుగు సినిమాలో నటించలేదు. కల్కి 2 లో నాగ్ అశ్విన్ డిజైన్ చేసిన క్యారెక్టర్ విపరీతంగా నచ్చడంతో వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ముంబై వర్గాల టాక్. మరోవైపు, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి పేరు కూడా ఈ సీక్వెల్ కోసం బలంగా వినిపించింది.
కానీ, అందులో ఎలాంటి నిజం లేదని నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఒక
ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ' కల్కి 2 గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. సరైన సమయంలో ఆ పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనేది చెప్తాం. దీపికా లేదని ఆ పాత్రను తొలగించారని వస్తున్న వార్తలో నిజం లేదని' తెలిపాడు. దీంతో సాయిపల్లవి కల్కి 2 లో లేదని కన్ఫర్మ్ అయ్యింది.
బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన ఈ సైన్స్ ఫిక్షన్ మైథాలజీ వండర్.. సీక్వెల్లో మరిన్ని విజువల్ అద్భుతాలను చూపించబోతోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలతో పాటు ఆలియా భట్ కూడా తోడైతే, కల్కి 2 బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ పనుల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తూ, పక్కా ప్లానింగ్‌తో ఈ భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ విషయం తెలియడంతో నెటిజన్స్ ఏం చేస్తున్నావయ్యా నాగీ.. ఎవరెవరిని దింపుతున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కల్కి 2 తో ప్రభాస్ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.