
హైదరాబాద్‌లోని మూసాపేట్ గూడ్స్ షెడ్ ప్రాంతంలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎలక్ట్రానిక్ వాహనాలు నిల్వ చేసే గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హైదరాబాద్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని మూసాపేట్ గూడ్స్ షెడ్ ప్రాంతంలో ఈరోజు (మంగళవారం) భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
ఎలక్ట్రానిక్ వాహనాలు నిల్వ చేసే గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాం మొత్తం దట్టమైన పొగతో కమ్ముకుపోగా, మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ గోదాంలో ఎలక్ట్రానిక్ వాహనాలు నిల్వ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
కాసేపటి తర్వాత మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో 60 ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటన జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే 8 నెలల నుంచి ఈ సర్వీస్ సెంటర్ గోదామును యాజమాన్యం మూసివేసింది. మోదీ హామీల లెక్క తేల్చండి..
ఆ తర్వాత నా రాజీనామా గురించి మాట్లాడండి: సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణను ఎగుమతి బియ్యం హబ్‌గా తీర్చిదిద్దుతాం: మల్లు భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News