
ఒకప్పడు రోళ్లు తయారుచేసి రోడ్డు పక్కన అమ్ముతూ జీవించిన ఆ కుటుంబం.. ప్రస్తుతం రాతి విగ్రహాలు తయారు చేస్తూ దేశవిదేశాలకు ఎగుమతి చేస్తోంది. కరీంనగర్‌లోని హుజురాబాద్‌కు చెందిన శ్రీనివాస్, సంపత్ సోదరులు సొంతూరులో రాతి విగ్రహాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు.
దేవతామూర్తులు, రాజకీయ నాయకులు, సామాన్యులు.. ఇలా ఏ విగ్రహాన్నైనా జీవకళ ఉట్టిపడేలా చెక్కుతున్నారు. వాటిని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర సహా అమెరికా, ఆస్ట్రేలియా వంటి పలు దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ వార్త చదివారా: యాప్‌లో యూరియా బుకింగ్..
రైతువేదికల్లో పంపిణీ: సీఎం రేవంత్