
ఇంటర్నెట్ డెస్క్: దగ్గు మందు (Cough syrup) విక్రయాల విషయంలో నియంత్రణ చర్యలకు కేంద్రం ఉపక్రమించింది. ఇకపై దగ్గుమందుతో సహా ఇతర సిరప్‌ల కొనుగోలుకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి చేసింది. ఈ మేరకు 1945 ఔషధ నిబంధనల్లో మార్పులు చేసింది.
దీనిని షెడ్యూల్ ‘కె’ డ్రగ్స్ జాబితా నుంచి తొలగిస్తూ ఆరోగ్యశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలోని ఔషధ నియంత్రణపై ‘డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు’తో సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గతేడాది నాసిరకం దగ్గుమందు సిరప్‌ల కారణంగా పలువురు చిన్నారులు మరణించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది.
దీంతో ఇకపై మెడికల్ షాప్‌లకు వెళ్లి నేరుగా దగ్గుమందు కొనుగోలు చేసే అవకాశం ఉండదు. గతేడాది రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ‘కోల్డ్రిఫ్’ దగ్గుమందు (Coldrif Cough Syrup) కారణంగా 20కి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాల నేపథ్యంలో కంపెనీలో తనిఖీ చేయగా..
సిరప్‌లో 48.6 శాతం డైఇథైలిన్ గ్లైకాల్ ఉందని తేలింది. ఇది అత్యంత విషపూరితమైనదిగా అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆ సిరప్‌పై నిషేధం విధించారు. ఇదీ చదవండి: నీట్ రీటెస్ట్.. టెలిగ్రామ్ యాప్‌ను బ్లాక్ చేసిన కేంద్రం గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.
ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.