
బెర్రీస్ ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ కొనుక్కు తినాలంటే ఖరీదెక్కువ. తినాలని ఉన్నా అందరూ కొనలేరు. కానీ ఈ బెర్రీ పళ్లలో చాలా రకాల విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ ఉంటాయి. శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలా అని కొనే పరిస్థితి ఉండదు.
అయితే ఇప్పుడా సమస్య లేదు. ఎందుకంటే ఇంట్లోనే వీటిని ఈజీగా పెంచేయొచ్చు. చిన్న బాల్కనీ ఉన్నా, టెర్రస్, గార్డెన్..ఇలా ఏదైనా సరే సులువుగా పెరుగుతాయి. కొద్దిపాటి సంరక్షణ, ఎండ తగిలితే చాలు, ఈ మొక్కలు ఇంటిలోనే రుచికరమైన పండ్లను ఇస్తాయి.
స్ట్రాబెర్రీ అంటే చాలామందికి ఇష్టం. కానీ మార్కెట్లో దీని ధర చాలా ఎక్కువ. కొన్నా కూడా పురుగులు ఉంటాయి. తినాలంటే భయమేస్తుంది. అందుకే పెంచుకున్న మొక్కలైతే పురుగు పట్టకుండా చూసుకోవచ్చు. అయితే దీన్ని కుండీలో లేదా హ్యాంగింగ్ బాస్కెట్లో సులభంగా పెంచుకోవచ్చు.
స్ట్రాబెర్రీ మొక్కకు రోజూ 5 నుంచి 6 గంటల ఎండ అవసరం. మొక్క ఉన్న కుండీలో నీరు నిల్వ కాకుండా చూసుకోవాలి. అందుకే సారవంతమైన మట్టిని వాడాలి. క్రమం తప్పకుండా నీరు పోయాలి. చలికాలంలో స్ట్రాబెర్రీ మొక్కలు పెంచితే మరి మంచిది. సాగుకు అనుకూలమైన సమయం కూడా.
బ్లూబెర్రీని సూపర్ ఫుడ్ అంటారు. కానీ దీని ధర కూడా చాలా ఎక్కువ. వీటిని కంటైనర్ గార్డెనింగ్ ద్వారా ఇంట్లోనే పండించవచ్చు. బ్లూబెర్రీ మొక్కలకు కొద్దిగా ఆమ్లత్వం న్న మట్టి అవసరం. క్రమం తప్పకుండా ఎరువులు వేస్తూ, తగినంత ఎండ తగిలేలా చూసుకుంటే మొక్క ఆరోగ్యంగా పెరిగి మంచి ఫలాలనిస్తుంది.
ఈ మొక్క మీ హోమ్ గార్డెన్‌కు కూడా మంచి అందాన్ని ఇస్తుంది
.