
ప్రకృతిని ఆస్వాదిస్తూ సాహసయాత్ర చేయాలనుకునే వారికి ట్రెక్కింగ్ మంచి అనుభూతిని ఇస్తుంది. అయితే, ట్రెక్కింగ్‌కు బయలుదేరే ముందు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇంటర్నెట్ డెస్క్: సాహసాలు ఇష్టపడేవారు స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు.
అయితే అడవుల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లే ముందు సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ట్రెక్కింగ్‌కు బయలుదేరే ముందు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ట్రెక్కింగ్‌కు వెళ్లేటప్పుడు మంచి నాణ్యత కలిగిన బూట్లు తప్పనిసరి.
సాధారణ స్పోర్ట్స్ షూలకు బదులుగా ట్రెక్కింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన షూలను ఉపయోగించడం మంచిది. ఇవి కఠినమైన మార్గాల్లో మంచి పట్టును ఇస్తాయి. అలాగే చీలమండకు రక్షణ, పాదాలకు సౌకర్యం అందించి గాయాల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వీలైనంత వరకు వాటర్‌ప్రూఫ్ బూట్లు ఎంచుకోవాలి.
ట్రెక్కింగ్‌కు శారీరక దృఢత్వం చాలా అవసరం. ఇందుకోసం ఎక్కువగా జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ట్రెక్కింగ్‌కు కొన్ని వారాల ముందే వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చేయడం ప్రారంభించాలి. ఇవి శరీరానికి బలం పెంచుతాయి.
ట్రెక్కింగ్ సమయంలో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. అడవుల్లో ఎక్కువ శబ్దం చేయడం, చెట్లు, మొక్కలకు నష్టం కలిగించడం వంటి వాటికి దూరంగా ఉండాలి. వెళ్లే మార్గం గురించి ముందే తెలుసుకోవాలి. అవసరమైతే గైడ్ సహాయం తీసుకోవడం మంచిది. పర్యావరణాన్ని కాపాడేందుకు చెత్త వేయకుండా 'లీవ్ నో ట్రేస్' నియమాన్ని పాటించాలి.
ట్రెక్కింగ్‌కు వెళ్లే ముందు వాతావరణ పరిస్థితులను తెలుసుకోవాలి. వేడి ఎక్కువగా ఉంటే గాలి బాగా ప్రసరించే దుస్తులు ధరించాలి. చేతులు, కాళ్లకు నిండుగా ఉన్న దుస్తులు ధరించడం మంచిది. ఇవి చిన్న గాయాలు, కీటకాల కాట్ల నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి.
రిలీఫ్ ఆయింట్మెంట్లు (క్రీములు లేదా జెల్స్), అవసరమైన మందులు తీసుకెళ్లాలి. అడవుల్లో దోమలు, ఇతర కీటకాల సమస్య కూడా ఉంటుంది. కాబట్టి యాంటీసెప్టిక్ క్రీమ్, దోమల నివారణ స్ప్రే లేదా క్రీమ్‌ను వెంట తీసుకెళ్లడం ప్రయోజనకరంగా ఉంటుంది.
ఆధార్ కార్డు దుర్వినియోగంపై పిటిషన్.. కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు
తెల్ల జుట్టు సమస్యకు కరివేపాకు-మెంతుల చిట్కా
ట్రెక్కింగ్ సమయంలో చిన్న గాయాలు, పాదాల నొప్పి, అలసట వంటి సమస్యలు రావచ్చు. అందుకే బ్యాగ్‌లో ఫస్ట్ ఎయిడ్ కిట్ తప్పకుండా ఉంచుకోవాలి. బ్యాండేజీలు, పెయిన్