
ఆధార్ కార్డుల దుర్వినియోగంపై దాఖలైన ఒక పిటిషన్‌పై సుప్రీం కోర్టు తాజాగా విచారణ చేపట్టింది. ఈ విషయంపై స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఇంటర్నెట్ డెస్క్: ఆధార్ కార్డుల దుర్వినియోగంపై దాఖలైన ఒక పిటిషన్‌పై సుప్రీం కోర్టు తాజాగా విచారణ చేపట్టింది.
ఆధార్‌ను కేవలం ఐడీ ప్రూఫ్‌గా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్‌పై స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అశ్వినీ కుమార్ అనే న్యాయవాది ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆధార్ కార్డు కేవలం ఐడీ ప్రూఫ్‌గా మాత్రమే వినియోగమయ్యేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్నికల సంఘానికి మార్గదర్శకాలు జారీ చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
పౌరసత్వం, స్థానికత, నివాస ధ్రువీకరణ పత్రంగా ఆధార్ వినియోగం కాకుండా స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని అభ్యర్థించారు. కొత్త ఓటర్ రిజిస్ట్రేషన్ దరఖాస్తులో డేట్ ఆఫ్ బర్త్‌కు ధ్రువీకరణగా ఆధార్ వినియోగం ఆధార్ చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం చెల్లదని అన్నారు.
ఆధార్ కార్డు పౌరసత్వానికి ప్రూఫ్ కాదని స్పష్టమైన మార్గదర్శకాలు ఉప్పటికీ దుర్వినియోగం అవుతోందని అన్నారు. వయసు ధ్రువీకరణ, పౌరసత్వం, స్థానికత, స్కూలు అడ్మిషన్లు, ఆస్తుల కొనుగోళ్లు, బర్త్ సర్టిఫికేట్కు దరఖాస్తు వంటి సందర్భాల్లో ఆధార్ దుర్వినియోగం అవుతోందని ఆరోపించారు.
దీనికి తోడుకు కొత్త ఓటర్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఫార్మ్-6లో కూడా పుట్టిన రోజు ధ్రువీకరణ, నివాసధ్రువీకరణ పత్రంగా దుర్వినియోగం అవుతోందని అన్నారు. కాబట్టి, ఆధార్‌ను కేవలం ఐడీ ప్రూఫ్‌గా పేర్కొంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
మహిళపై పాత క్లాస్మేట్ అకృత్యాలు.. ప్రైవేట్ ఫొటోలు, వీడియోలతో భయపెట్టి.. కాఫ్ సిరప్ కొనాలంటే ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి