
శరీరానికి సరిపడా నీరు తాగకపోతే మూత్రపిండాలపై ఒత్తిడి పడే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, నీరు తక్కువగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇంటర్నెట్ డెస్క్: శరీరానికి సరిపడా నీరు తాగడం ఆరోగ్యానికి చాలా అవసరం.
ఎందుకంటే నీరు శరీరంలోని అన్ని అవయవాల పనితీరును సక్రమంగా నిర్వహించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియ మెరుగుపడటం, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ, వ్యర్థ పదార్థాలను బయటకు పంపడం, మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడడంలో నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
తగినంత నీరు తాగకపోతే మూత్రపిండాల పనితీరు ప్రభావితం అవుతుంది. అలాగే అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణులు తెలిపిన సమాచారం ప్రకారం.. నీరు తక్కువగా తాగితే మూత్రంలో బ్యాక్టీరియా పేరుకుపోయే అవకాశం ఉంటుంది.
ఇది మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ (UTI) వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. మూత్ర మార్గం ద్వారా హానికరమైన బ్యాక్టీరియాను బయటకు పంపేందుకు నీరు చాలా అవసరం. నీరు తక్కువగా తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా పెరుగుతుంది. శరీరం డీహైడ్రేషన్‌కు గురైతే జీర్ణరసాల ఉత్పత్తి తగ్గుతుంది.
దీని వల్ల గ్యాస్ట్రిటిస్, అల్సర్ వంటి సమస్యలు రావచ్చు. అలాగే మలబద్ధకం సమస్య కూడా తలెత్తవచ్చు. అంతేకాకుండా చర్మ సమస్యలు కూడా రావచ్చు. తామర, సోరియాసిస్ వంటి సమస్యలతో పాటు చర్మం పొడిబారడం, దురద వంటి సమస్యలు కనిపిస్తాయి. నీటి కొరత మెదడు పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది.
మెదడుకు రక్తప్రసరణ, ఆక్సిజన్ సరఫరా తగ్గడంతో తలనొప్పి రావచ్చు. అలాగే నోటిలో బ్యాక్టీరియా పెరిగి నోటి దుర్వాసన సమస్య కూడా ఎక్కువవుతుంది. Note: ఇందులోని సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే.. ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది.
ఈ తప్పులు చేస్తే కష్టాలు తప్పవు
ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు. ఎలక్ట్రిక్ కారుతో సుదూర ప్రయాణం? ఈ జాగ్రత్తలు తప్పనిసరి ఎంతటి జ్ఞానవంతుడైనా