
Secunderabad Bonalu 2026 Schedule Out: సికింద్రాబాద్ లష్కర్ బోనాల వేడుకలకు ముహూర్తం ఖరారైంది. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి జాతర సన్నాహాలు పూర్తయ్యాయి. ఆలయ అర్చకులు ఈ జాతరకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ ఇన్-చార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి తెలియజేశారు.
జూలై 19వ తేదీన ఘటోత్సవం నిర్వహించి, ఆగస్టు 2వ తేదీన సికింద్రాబాద్ బోనాలు జరగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులతో సమీక్ష నిర్వహించి, తగిన ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
సికింద్రాబాద్ దద్దరిల్లనుంది...మూడు రోజులు బోనాల వేడుకలతో నగరం వైభవంగా మారుతుంది. లష్కర్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి వివరాలను అందించారు.
అమ్మవారి బోనాల జాతర షెడ్యూల్ గురించి ఆలయ చైర్మన్, అర్చకులు వివరించారు. అమ్మవారి ఘటోత్సవం (ఎదుర్కోలు) జూలై 19వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరుగుతుంది. ఇక ప్రధాన బోనాల ఉత్సవం ఆగస్టు 2వ తేదీ ఆదివారం ఉదయం 4 గంటల నుండి ప్రారంభం కానుంది.
ఆ తర్వాత మరుసటి రోజే రంగం కార్యక్రమం జరుగుతుంది. ఆగస్టు 3వ తేదీ సోమవారం ఉదయం 8:30 గంటలకు అమ్మవారి గజావాహన ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఆషాడ మాస బోనాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.
కోరిన కోరికలు తీర్చే అమ్మవారి ఉత్సవాలు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆషాడ మాస బోనాలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. త్వరలోనే బోనాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు.
ఉండగా ఈసారి ఆషాఢమాసం 2026 జూలై 15వ తేదీన ప్రారంభం కానుంది.
వచ్చే ఆదివారం రోజే హైదరాబాద్ బోనాలు కూడా నిర్వహించనున్నారు. ఇదిలా