
ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో స్టార్ హీరోయిన్ సిమ్రాన్ ఒకరు. అందం అభినయం కలబోసినా సిమ్రాన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ్ భాషల్లో సిమ్రాన్ బ్లాక్ బస్టర్ మూవీస్ చేశారు.
అప్పట్లో సిమ్రాన్ హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు. సన్నజాజి నడుముతో ఆడియన్స్ ను కవ్వించారు సిమ్రాన్. సిమ్రాన్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. సన్నజాజి తీగలాంటి నడుముతో.. ఆకట్టుకునే అభినయంతో అప్పటి కుర్రకారును కవ్వించింది ఈ వయ్యారి భామ.
తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది అలాగే మహేష్ బాబుతోనూ నటించి మెప్పించింది సిమ్రాన్. మహేష్ హీరోగా నటించిన యువరాజు సినిమాలో నటించింది. అలాగే సిమ్రాన్ తమిళ్లోనూ దాదాపు అందరు స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించింది సిమ్రాన్.
స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే సినిమాలకు బ్రేక్ ఇచ్చి అభిమానులకు షాక్ ఇచ్చింది సిమ్రాన్. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి ఆచితూచి సినిమాలు చేస్తోంది. ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది సిమ్రాన్.
సూర్య సరసన ఆమె నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే ఆతర్వాత ధ్రువనక్షతం అనే సినిమాలో నటించారు. అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలోనూ నటించారు సిమ్రాన్ మొన్నామధ్య సిమ్రాన్ టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాలోనూ నటించారు.
ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే సిమ్రాన్ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా సిమ్రాన్ తమిళనాడు సీఎం విజయ్ ను కలిశారు. ఫ్యామిలీతో కలిసి సీఎం విజయ్ ను కలిశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్
అవుతున్నాయి. సిమ్రాన్ కు ఇద్దరు కొడుకులు. సిమ్రాన్ కొడుకులు అచ్చం హీరోల్లా ఉన్నారు. ఇద్దరూ బాలీవుడ్ హీరోల్లాగా ఉన్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. వీరి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
A post shared by SIMRAN (@actorsimranofficial) మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి