అవని కష్టాలు పగోడికి కూడా రాకూడదు. ఓ పక్క తన వల్లే తన తల్లి మీనాక్షి జైలు పాలైందని బాధపడుతుంటే.. ఇప్పుడు హాస్పిటల్ పాలై మరింత గుండెకోత మిగుల్చింది. ఇక ఈరోజు (జూన్ 16) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. చావు బతుకుల మధ్య ఉన్న మీనాక్షిని చూడ్డానికి వస్తాడు భరత్.
గొంతుకోసి ప్రాణం పోకుండా పసరుపూసినట్టుగా.. మీనాక్షి దుస్థితికి కారణం అయిన పల్లవే.. ఆమెకి బ్లడ్ ఇవ్వడానికి హాస్పిటల్‌కి వస్తుంది. మా సిస్టర్‌ది ఓ నెగిటివ్ తను బ్లడ్ డొనేట్ చేయడానికి వస్తుందని చెప్తాడు భరత్. అంతలోనే వస్తుంది పల్లవి.
రండి రండి అంటూ లోపలికి తీసుకుని వెళ్తుంటుంది డాక్టర్. వెళ్తూ వెళ్తూ అవని వైపు కోపంగా చూస్తుంది పల్లవి. అయితే పల్లవి.. బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రావడంతో ఆనందపడతాడు కమల్. ఇక రక్తదానం చేసి.. మీనాక్షి ప్రాణాలను నిలబెట్టిన పల్లవిని చూసి ఎమోషనల్ అవుతుంది అవని.
థాంక్స్ పల్లవీ.. సమయానికి వచ్చి సాయం చేశావ్ అని అంటుంది. ఇక పెళ్లానికి ఎలా ముప్పుతిప్పలు పెట్టాలా? వదనకి ఎలా భజన చేయాలా? అని తాపత్రయ పడే కమల్.. ఈసారి మాత్రం ‘బ్లడ్ డొనేట్ చేశావ్ కదా.. రా కూర్చో నీరసంగా ఉందా అంటూ తెగ ప్రేమ చూపించేస్తాడు.ఆపరేషన్ సక్సెస్..
పేషెంట్ డెడ్.. ‘ఘోరం జరిగిపోయిందే’ అంటే బ్లడ్ డొనేట్ చేస్తే పెళ్లంపై ప్రేమ ఉంటుందన్నమాట.. లేదంటే ఉండదన్నమాట అనేట్టుగానే ఉంటుంది ఈ సీన్. ఇప్పుడే వస్తా ఉండూ అంటూ వెళ్లి జ్యూస్ తీసుకుని వస్తాడు కమల్. ఇక పల్లవి బ్లడ్ డొనేట్ చేయడంతో..
మీనాక్షి సర్జరీ కంప్లీట్ అవుతుంది. కంగారుగా బయటకు వచ్చిన డాక్టర్.. ‘ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్’ అన్నట్టుగా.. బ్లడ్ మిస్ మ్యాచ్ కావడంతో ఆమెను కాపాడలేకపోయాం అంటూ బాంబ్ పేల్చుతుంది. ఆ మాట వినగానే.. అమ్మా అమ్మా అంటూ భోరున ఏడుస్తారు భరత్, అవనిలు.
కానీ
పల్లవి మాత్రం.. చచ్చిందా అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తుంది. బ్లడ్ మార్చేసిన పల్లవి.. మీనాక్షీ.. మీనాక్షీ అంటూ గుండెలు బాదుకుని ఏడుస్తుంటాడు చక్రధర్. అటు పల్లవి క్రూరంగా తనలో తాను నవ్వుకుంటూ.. ‘నేను ఇచ్చిన ఓ నెగిటివ్ బ్లడ్ కాకుండా.. ఓ పాజిటివ్ బ్లడ్ మీ అమ్మకి ఎక్కించేట్టు చేశాను’ అంటూ బ్లడ్ పాకెట్స్ మార్చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. కట్ చేస్తే.. పల్లవీ పల్లవీ అని పిలుస్తుంటాడు కమల్. అప్పుడు కలలో నుంచి బయటకు వస్తుంది పల్లవి. ఇది కల అయినా జరిగేది ఇదే కదా అని అనుకుంటుంది పల్లవి. కానీ పల్లవి అనుకున్నదానికి రివర్స్ అవుతుంది. డాక్టర్ వచ్చి.. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్‌కి ప్రమాదం ఏం లేదు’ అని అంటుంది. దాంతో ఊపిరి పీల్చుకుంటుంది అవని. థాంక్యూ పల్లవీ థాంక్యూ.. దెబ్బకి నోరెళ్ల బెడుతుంది పల్లవి. ఇక పల్లవి బ్లడ్ ఇవ్వడం వల్లే మీనాక్షి బతికిందని నమ్మని చక్రధర్.. ‘మీనాక్షికి ప్రాణాలు పోశావ్.. బ్లడ్ డొనేట్ చేసి నీలో కూడా మంచితనం ఉందని చూపించావ్’ అని అంటాడు. ఇక భరత్ అందుకుని.. పల్లవి సిస్టర్ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకున్నారు. తను ఎంత మంచిదో ఇప్పటికైనా అర్థం అయ్యిందా? అని అంటాడు. ఇక కమల్ అయితే.. ‘చాలా థాంక్స్ పల్లవీ.. నువ్వు ఇంత మంచిదానివి అని అస్సలు అనుకోలేదు.. లవ్యూ పల్లవీ.. లవ్యూ అంటూ పల్లవిని వాటేసుకుంటాడు కమల్. ఏంటీ నేను మారేదీ.. మా అమ్మ చావుకి కారణమైన దాన్ని వదిలిపెట్టను అదే మంచి మనసుతో కేసు వాపస్ తీసుకుంటే అత్తయ్య రిలీజ్ అవుతుంది కదా.. అని అంటాడు కమల్. అవును పల్లవీ.. నువ్వు ఈ కేసు వాపస్ తీసుకుంటే బావుంటుంది.. ఆమెకు మరో జీవితాన్ని ఇచ్చిన దానివి అవుతావ్ అని అంటాడు అక్షయ్, చక్రధర్లు. ‘ఏంటి తీసుకునేదీ.. మా మామ్‌కి చావుకి కారణం అయిన వాళ్లని నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. ఆ దేవుడు దిగొచ్చి చెప్పినా నా నిర్ణయం మారదు’ అని ఆవేశంగా వెళ్లిపోతుంది పల్లవి. ఇక బయటకు వచ్చిన తరువాత.. ‘మీనాక్షి బతకకూడదే.. ఎలా బతికిందీ అంటూ జుట్టు పీక్కుంటుంది పల్లవి. అప్పుడు మన హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. మళ్లీ కొట్టిందయ్యో.. నువ్వుం చేశావో మొత్తం చూశానే ఆ తరువాత జరిగే సీన్.. ప్రేక్షకులకు తెలిసిందే. ప్రతిసారీ జరిగేది. తనకి అలవాటైన పద్దతిలో పల్లవిని లాగిపెట్టి కొడుతుంది అవని. ‘నా మీద కేసు పెట్టి నన్ను జైలుకి పంపించాలని అనుకున్నావ్.. మా అమ్మ నన్ను కాపాడటానికి నేరం తనపై వేసుకుంది. ఇప్పుడు నాపై పగతో మా అమ్మనే చంపాలని చూస్తావా? ఛీ ఛీ నీకు మానవత్వమే లేదా? సాక్ష్యుల్ని కోర్టుకి రాకుండా చేశావ్.. నువ్వు ఇప్పుడు రక్తం ఇవ్వడానికి వచ్చావ్ అంటే ఎలా నమ్ముతానని అనుకున్నావ్.. అందుకే నీపై ఓ కన్నేశాను.. నువ్వు ఏం చేశావో మొత్తం చూశాను. నువ్వు బ్లడ్ ప్యాకెట్స్ మార్చగానే.. మళ్లీ వాటిని నేను మార్చేశాను’ అంటూ జరిగింది మొత్తం చెప్తుంది అవని. ఇక రేపటి ఎపిసోడ్లో సుబ్బారావు ఎక్కడున్నాడో కనిపెట్టి కమల్‌తో తుక్కు రేగ్గొట్టిస్తుంది అవని. ఆ ముచ్చట తరువాతి ఎపిసోడ్లో చూద్దాం.