
మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో అత్యంత అమానవీయమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి భార్యపై ఓ ముఠా దారుణానికి ఒడిగట్టింది. ఆ మహిళపై పాత స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఈ దారుణానికి ఒడిగట్టారు.
అంతటితో ఆగకుండా ఈ దృశ్యాలను సీక్రెట్ గా వీడియోలు తీసి లక్షల రూపాయలను వసూలు చేశారు. అంతేకాక ఆమెతో బలవంతంగా మత మార్పిడి చేయించారు. నిఖా కూడా చేయించారు. ఈ దారుణాలకు పాల్పడిన కీలక నిందితుడు అయాజ్ తాజ్ మదారే(26), మరో నిందితుడు అమీన్ షేక్(30) లను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఏం జరిగిందంటే..?నాగ్ పూర్ కు చెందిన ఐఏఎఫ్ అధికారి వృత్తి రిత్యా వేరే నగరంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక అతని భార్య(24) ప్రాపర్టీ డీలింగ్ వ్యాపారం చేస్తుంటారు. గతేడాది ఫిబ్రవరిలో అయాజ్..
ఆ మహిళను సంప్రదించాడు. ఓ ప్లాట్ కొనుగోలు విషయంలో ఆమెను వార్దా రోడ్ లోని ఓ హోటల్ రూమ్ కు ఆహ్వానించాడు. అయితే అప్పటికే అయాజ్, మహిళ పాత స్నేహితులు కావడంతో ఆమె వెళ్లింది. ఇక హోటల్ రూమ్ లో ఆమెకు మత్తు మందు కలిపిన జ్యూస్ ఇచ్చి..
అయాజ్.. తన స్నేహితులతో కలిసి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అలాగే ఆ దృశ్యాలను వీడియోలుగా తీసి బ్లాక్ మెయిల్ చేశారు. అలా రూ. 3 లక్షల వరకు బాధిత మహిళ నుంచి కాజేశారు.ఆ తర్వాత గతేడాది మే లో నిందితుడు అయాజ్, అతడి అనుచరుడు అమీన్ షేక్ కలిసి ఆ యువతిని కల్మేశ్వర్ ప్రాంతానికి బలవంతంగా తీసుకెళ్లి..
అక్కడ హజ్రత్ మౌలానా అనే మత పెద్ద చేత బలవంతంగా మత మార్పిడి చేయించారు. అంతేకాక ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అయాజ్ తో నిఖా జరిపించినట్లు సమాచారం. అయితే ఇటీవల ఆ మహిళ భర్త
మహారాష్ట్రలోని నాగ్‌ పూర్‌ లో అత్యంత అమానవీయమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి భార్యపై ఓ ముఠా దారుణానికి ఒడిగట్టింది. ఆ మహిళపై పాత స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఈ దారుణానికి ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా ఈ దృశ్యాలను సీక్రెట్ గా వీడియోలు తీసి లక్షల రూపాయలను వసూలు చేశారు. అంతేకాక ఆమెతో బలవంతంగా మత మార్పిడి చేయించారు. నిఖా కూడా చేయించారు. ఈ దారుణాలకు పాల్పడిన కీలక నిందితుడు అయాజ్ తాజ్ మదారే(26), మరో నిందితుడు అమీన్ షేక్(30) లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఏం జరిగిందంటే..?నాగ్ పూర్ కు చెందిన ఐఏఎఫ్ అధికారి వృత్తి రిత్యా వేరే నగరంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక అతని భార్య(24) ప్రాపర్టీ డీలింగ్ వ్యాపారం చేస్తుంటారు. గతేడాది ఫిబ్రవరిలో అయాజ్.. ఆ మహిళను సంప్రదించాడు. ఓ ప్లాట్ కొనుగోలు విషయంలో ఆమెను వార్దా రోడ్ లోని ఓ హోటల్ రూమ్ కు ఆహ్వానించాడు. అయితే అప్పటికే అయాజ్, మహిళ పాత స్నేహితులు కావడంతో ఆమె వెళ్లింది. ఇక హోటల్ రూమ్ లో ఆమెకు మత్తు మందు కలిపిన జ్యూస్ ఇచ్చి.. అయాజ్.. తన స్నేహితులతో కలిసి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అలాగే ఆ దృశ్యాలను వీడియోలుగా తీసి బ్లాక్ మెయిల్ చేశారు. అలా రూ. 3 లక్షల వరకు బాధిత మహిళ నుంచి కాజేశారు.ఆ తర్వాత గతేడాది మే లో నిందితుడు అయాజ్, అతడి అనుచరుడు అమీన్ షేక్ కలిసి ఆ యువతిని కల్మేశ్వర్ ప్రాంతానికి బలవంతంగా తీసుకెళ్లి.. అక్కడ హజ్రత్ మౌలానా అనే మత పెద్ద చేత బలవంతంగా మత మార్పిడి చేయించారు. అంతేకాక ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అయాజ్‌ తో నిఖా జరిపించినట్లు సమాచారం. అయితే ఇటీవల ఆ మహిళ భర్త ఇంటికి రావడంతో జరిగిందంతా చెప్పింది. దాంతో అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులు అయాజ్ తాజ్ మదారే(26), మరో నిందితుడు అమీన్ షేక్(30) లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.