
ఆక్సిడైజ్డ్ సిల్వర్ ఫినిషింగ్‌తో వచ్చే ఈ పట్టీలు ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. దీనికి ఉండే చిన్న చిన్న గజ్జెలు నడుస్తున్నప్పుడు మంచి శబ్దం చేస్తాయి. రాళ్ల ఫినిషింగ్‌తో వచ్చే ఈ గజ్జెల పట్టీలు క్లాసిక్ లుక్ ఇస్తాయి. ఇవి చాలా బరువుగా ఉంటాయి.
పండగలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఇవి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఫ్యూజన్ లుక్‌తో ఉండే ఈ పట్టీలు చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి. ఈ పట్టీలపై చాలా సూక్ష్మమైన వర్క్ ఉంటుంది. కింద స్క్వేర్ షేప్‌లో ఉన్న చార్మ్‌కి తెల్ల పూసలు కూడా జతచేశారు.
క్లస్టర్ గజ్జెల పట్టీలు ఎప్పటికీ ట్రెండ్‌లో ఉండే ఎవర్ గ్రీన్ డిజైన్. వీటి శబ్దం చాలా దూరం వరకు వినిపిస్తుంది. లైట్ వెయిట్ లో వస్తాయి కాబట్టి, రోజూ వేసుకోవడానికి బాగుంటాయి. చైన్లు, గజ్జెలతో అలంకరించిన ఈ పట్టీలు చాలా పాపులర్.
ఈ డిజైన్ అన్ని వయసుల మహిళలకు అందంగా కనిపిస్తుంది. కాళ్ల అందాన్ని మరింత పెంచుతుంది. మోడ్రన్, స్టైలిష్ లుక్‌ను ఇష్టపడే మహిళలకు మల్టీ-లేయర్ ఆక్సిడైజ్డ్ పట్టీలు పర్ఫెక్ట్గా సరిపోతాయి. దీనిలోని అనేక లేయర్లు కాళ్లకు యూనిక్, ఫ్యాషనబుల్ లుక్‌ను అందిస్తాయి.
Cotton Sarees: రూ.400కే దొరికే డైలీ వేర్ ఫ్యాన్సీ కాటన్ చీరలు Coin Bangles:కాసులతో నక్లెస్ కాదు కాసుతో గాజులు ఎప్పుడైనా ట్రై చేశారా? Bangle Designs: కళ్లు చెదిరే డిజైన్ లో కడా బ్యాంగిల్ సెట్స్.. ఇవిగో!