
వారసత్వ ఉద్యోగాల్లో సింగరేణి కార్మికుల (Singareni workers)కు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కవిత (Kavitha) మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని కాసిపేట గని పై బొగ్గుబాయి బాట కార్యక్రమంలో భాగంగా గేట్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సింగరేణి సంస్థ పరిరక్షణ కోసమే టీఆర్ఎస్ (TRS) హింద్ మజ్దూర్ సభ ( హెచ్ఎంఎస్) కలిసి పని చేస్తున్నాయని తెలిపారు. పాలసీలు రూపొందించాల్సిన సీఎం (CM), డిప్యూటీ సీఎం (Deputy CM)లే అధికారులకు వినతిపత్రాలు ఇస్తూ, కార్మిక రంగాన్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు.
సింగరేణి సంస్థను ప్రైవేటీకరించడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అండర్ గ్రౌండ్ మైన్లను కాపాడుకోవడానికి హెచ్ఎంఎస్ తో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు
.