
అఖిల్ అక్కినేని (Akhil Akkineni) అంటే అందరికీ ట్రోలింగ్ మెటీరియల్ అని చెప్పాలి. అయ్యగారు అంటూ ట్రోల్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియా జనం. ఇక అతని వైఖరి కూడా అలాగే ఉంటుంది. “ఏజెంట్” మూడేళ్ళ క్రితం విడుదలైంది. ఈ గ్యాప్ లో పెళ్లి చేసుకున్నాడు.
కానీ సినిమాలు విడుదల చెయ్యలేదు. ఇన్నేళ్లకు లెనిన్ (Lenin) వస్తోంది. ఎంతో హడావిడి చేసిన “లెనిన్” (Lenin) చిత్రం ఈ ఒక్క ఏడాదే మూడు సార్లు వాయిదా పడింది. రిలీజ్ విషయంలోనే ఇన్ని సార్లు డేట్లు, మాటలు మార్చిన లెనిన్ గురించి ఇప్పుడు పండగ మొదలు అంటూ పోస్టర్ విడుదల చెయ్యడంతో మరింత ట్రోలింగ్ జరుగుతోంది.
ఈ సినిమాకో కొత్త డేట్… జులై 10. దాంతో ఇక పండుగ మొదలు అంటూ కొత్త డేట్ తో పోస్టర్ విడుదల చేసింది టీం. ఐతే, ఇప్పటికే డేట్స్ మార్చడంతో మండిపోయి ఉన్న అభిమానులు, సోషల్ మీడియా జనం మాత్రం ఎకసెక్కాలు ఆడుతున్నారు. నాగార్జున స్వయంగా మరో నిర్మాత నాగవంశీతో కలిసి నిర్మించిన ఈ చిత్రం అఖిల్ కెరీర్ లో ఆరోది.
ఇప్పటివరకు ఒక్క భారీ హిట్ లేదు అఖిల్ కెరీర్లో. ఇది తప్పనిసరిగా ఆడాలి. లేదంటే ఈ పండగ ఉండదు. అందుకే, అక్కినేని ఫ్యాన్స్ లో అంత అసహనం ఉంది. “లెనిన్” విడుదల విషయంలో ఇన్ని మార్పులు చెయ్యడంతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కొడుకు సినిమా సరిగా ప్లాన్ చేయలేరా అంటూ నాగార్జునని కూడా కామెంట్ చేస్తున్నారు.
“ఏ పండుగ చేసుకోవాలి? సంక్రాంతా, క్రిస్మసా, రంజానా?” అంటూ పోకిరి డైలాగ్ చెప్తున్నారు
.