
అమెరికా- ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి.. అటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వైఖరికి అస్సలు పొంతన లేకుండా ఉంది. ఇరాన్ తో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నామని ట్రంప్ చెబుతున్నప్పటికీ నెతన్యాహు మాత్రం ఇరాన్ పై తన కఠిన వైఖరిని మరోసారి బయట పెట్టారు.
ఇరాన్ తో అణు ఒప్పందం కుదిరినా.. కుదరకపోయినా ఇరాన్ దగ్గర అణు ఆయుధాలు ఉండటాన్ని తాము ఎప్పటికీ అంగీకరించమని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధానిగా తాను ఉన్నంత వరకు అది జరగనే జరగదని శపథం చేశారు. ఈ మేరకు ఇరాన్ పై దాడులు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు.ఇరాన్లోని అణు శాస్త్రవేత్తలు, ముఖ్య నాయకులు, మిస్సైల్ నిల్వలపై ఇజ్రాయెల్ మునుపెన్నడూ లేనంతగా అత్యంత భీకరంగా దాడులు చేసిందని నెతన్యాహు పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ ను నాశనం చేయాలనుకున్న అణు ముప్పు నుంచి దేశాన్నికాపాడుకున్నామని అన్నారు. ఇరాన్, లెబనాన్ ను విడిచి పెట్టమని ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.ఎలాంటి శాంతి ఒప్పందాలూ ఇజ్రాయెల్ ను ఆపలేవని.. ఇరాన్, లెబనాన్ లపై దాడులు కొనసాగుతాయని నెతన్యాహు స్పష్టంచేశారు.
ఇరాన్ తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసుకున్న శాంతి ఒప్పందాన్ని తాను విభేదిస్తున్నానని నెతన్యాహు బాంబ్ పేల్చారు. ఇజ్రాయెల్ రక్షణను ఎవరి చేతుల్లోనూ పెట్టేందుకు తాము అంగీకరించేది లేదని నెతన్యాహు వెల్లడించారు. నెతన్యాహు వ్యాఖ్యలతో మిడిల్ ఈస్ట్ లో మరోసారి ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి.
మిడిల్ ఈస్ట్ విషయంలో అమెరికా-ఇజ్రాయెల్ దారులు వేరని ఈ ప్రకటనతో తేలిపోయిందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇక ఇరాన్- అమెరికా మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఇకపై అణ్వాయుధాలు కలిగి ఉండదని..
అందుకు ఇరాన్ అంగీకరించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అలాగే ఇరాన్ కు అమెరికా 300 మిలియన్ డాలర్లు చెల్లించనుందన్న వార్తలను ట్రంప్ పూర్తిగా ఖండించారు
అమెరికా- ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి.. అటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వైఖరికి అస్సలు పొంతన లేకుండా ఉంది. ఇరాన్ తో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నామని ట్రంప్ చెబుతున్నప్పటికీ నెతన్యాహు మాత్రం ఇరాన్ పై తన కఠిన వైఖరిని మరోసారి బయట పెట్టారు. ఇరాన్ తో అణు ఒప్పందం కుదిరినా.. కుదరకపోయినా ఇరాన్ దగ్గర అణు ఆయుధాలు ఉండటాన్ని తాము ఎప్పటికీ అంగీకరించమని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధానిగా తాను ఉన్నంత వరకు అది జరగనే జరగదని శపథం చేశారు. ఈ మేరకు ఇరాన్ పై దాడులు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు.ఇరాన్‌లోని అణు శాస్త్రవేత్తలు, ముఖ్య నాయకులు, మిస్సైల్ నిల్వలపై ఇజ్రాయెల్ మునుపెన్నడూ లేనంతగా అత్యంత భీకరంగా దాడులు చేసిందని నెతన్యాహు పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ ను నాశనం చేయాలనుకున్న అణు ముప్పు నుంచి దేశాన్నికాపాడుకున్నామని అన్నారు. ఇరాన్, లెబనాన్ ను విడిచి పెట్టమని ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.ఎలాంటి శాంతి ఒప్పందాలూ ఇజ్రాయెల్‌ ను ఆపలేవని.. ఇరాన్‌, లెబనాన్ లపై దాడులు కొనసాగుతాయని నెతన్యాహు స్పష్టంచేశారు. ఇరాన్ తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ చేసుకున్న శాంతి ఒప్పందాన్ని తాను విభేదిస్తున్నానని నెతన్యాహు బాంబ్ పేల్చారు. ఇజ్రాయెల్‌ రక్షణను ఎవరి చేతుల్లోనూ పెట్టేందుకు తాము అంగీకరించేది లేదని నెతన్యాహు వెల్లడించారు. నెతన్యాహు వ్యాఖ్యలతో మిడిల్ ఈస్ట్ లో మరోసారి ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. మిడిల్ ఈస్ట్ విషయంలో అమెరికా-ఇజ్రాయెల్‌ దారులు వేరని ఈ ప్రకటనతో తేలిపోయిందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇక ఇరాన్- అమెరికా మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఇకపై అణ్వాయుధాలు కలిగి ఉండదని.. అందుకు ఇరాన్ అంగీకరించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అలాగే ఇరాన్ కు అమెరికా 300 మిలియన్ డాలర్లు చెల్లించనుందన్న వార్తలను ట్రంప్ పూర్తిగా ఖండించారు. ఈ విషయాలను ట్రూత్ సోషల్ మాధ్యమం ద్వారా పోస్టు చేశారు. అయితే ఇరాన్ విషయంలో ట్రంప్- నెతన్యాహు వైఖరి భిన్నంగా ఉన్నాయి. ఈ క్రమంలో మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు ఇప్పట్లో చక్కబడేలా లేవని తెలుస్తోంది.