
3 Days Continous School and Bank Holidays: వేసవి సెలవులు ముగిసిన తర్వాత పాఠశాలలు ఇటీవలే తిరిగి ప్రారంభమయ్యాయి. జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా, ఆ తేదీని 15వ తేదీకి మార్చారు. అయితే, పాఠశాలలకు వరుసగా మరో 3 రోజులు సెలవులు రానున్నాయి.
బ్యాంకులు కూడా మూడు రోజుల పాటు మూసివేయున్నారు.. కాబట్టి మీ పనులను ముందుగానే పూర్తి చేసుకోండి. అవి ఎప్పుడు ఎప్పుడు ఉన్నాయో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రభుత్వం 2026 జూన్ 26న మొహర్రం సందర్భంగా సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పాఠశాలలు, కళాశాలలు కూడా మూసివేస్తారు.
మొదట జూన్ 25న సెలవు ప్రకటించగా, ప్రభుత్వానికి మార్చమని కోరడంతో మళ్లీ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థలు కూడా 26వ తేదీన బంద్ ఉంటాయి. సమ్మర్ హాలిడేస్ తర్వాత పాఠశాలలకు మళ్లీ వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి.
జూన్ 26న మొహర్రం సెలవు అని ఇప్పటికే తెలిసిందే. ఆ మరుసటి రోజున అంటే జూన్ 27న నాలుగో శనివారం బ్యాంకులు పనిచేయవు. సెలవు ఉన్న విద్యార్థులు ఈ సమయంలో ఫ్యామిలీ ట్రిప్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కూడా శని, ఆదివారాలు సెలవు ఉంటుందని తెలిసిందే.
ఆ తర్వాత జూన్ 28 ఆదివారం కూడా సెలవు కావడంతో, ఇలా వరుసగా మూడు రోజుల పాటు పాఠశాలలకు మరియు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. ఈ మూడు రోజుల లాంగ్ వీకెండ్ సెలవుల కారణంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూసివేసి ఉంటాయి, కాబట్టి విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంక్ సిబ్బంది అందరికీ సెలవు ఉంటుంది.
అయితే, ఈ సెలవులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వర్తించవు; ఇవి ఆయా స్థానిక ప్రభుత్వాల నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. అధికారికంగా జూన్ 26న మొహర్రం కాబట్టి
, శనివారం కూడా పూర్తి సెలవు ఇవ్వవచ్చు లేదా హాఫ్ డే ప్రకటించవచ్చు. శనివారాల్లో తరగతులు నిర్వహించని సంస్థలు విద్యార్థులకు మూడు రోజుల సెలవు ఇస్తాయి. సమ్మర్ హాలిడేస్ ముగిసిన తర్వాత ఇది మొదటిసారిగా వస్తున్న లాంగ్ వీకెండ్ హాలిడేస్. దీనివల్ల కుటుంబాలు చిన్నపాటి ప్రయాణాలు లేదా ఇతర కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం.